42 ఏళ్ల వయసున్న మహిళతో 25 ఏళ్ల బ్యాంక్ ఉద్యోగి వివాహేతర సంబంధం.. చివరకు అతడి పరిస్థితి ఏంటంటే..
ABN , First Publish Date - 2022-05-20T23:15:27+05:30 IST
ఆ యువకుడికి 25ఏళ్లు. బ్యాంకులో ఉద్యోగం కూడా చేస్తున్నాడు. వయసుకు తగ్గ అమ్మాయిని పెళ్లి చేసుకుని లైఫ్ లీడ చేయకుండా వక్ర బుద్ధితో ఆలోచించాడు. 42ఏళ్ల మహిళపై మనసు పడ్డాడు. ఆమెతో అక్రమ

ఇంటర్నెట్ డెస్క్: ఆ యువకుడికి 25ఏళ్లు. బ్యాంకులో ఉద్యోగం కూడా చేస్తున్నాడు. వయసుకు తగ్గ అమ్మాయిని పెళ్లి చేసుకుని లైఫ్ లీడ చేయకుండా వక్ర బుద్ధితో ఆలోచించాడు. 42ఏళ్ల మహిళపై మనసు పడ్డాడు. ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. చివరికి అతడి పరిస్థితి ఎలా తయారైందనే వివరాల్లోకి వెళితే..
పంజాబ్లోని ఖన్నా ప్రాంతానికి చెందిన రంజోద్ సింగ్.. అదే ప్రాంతంలోని ఐసీఐసీఐ బ్యాంకులో పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే కిరాణా షాపు నడుపుకుంటున్న హర్దీప్ కౌర్ అనే మహిళతో అతడికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా హద్దులు దాటి.. వివాహేతర సంబంధం వరకూ వెళ్లింది. అయితే ఈ విషయం హర్దీప్ కౌర్ కొడుకులకు తెలిసిపోయింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ ఇద్దరూ.. తల్లితో గొడవకు దిగారు. అనంతరం అతడిని హత మార్చేందుకు ప్రణాళిక రచించారు. రంజోద్ సింగ్కు తల్లితో ఫోన్ చేయించి ఇంటికి పిలిపించారు. అనంతరం ఆ యువకులు ఇద్దరూ రంజోద్ సింగ్ను కట్టేసి చితక్కొట్టారు. కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న రంజోద్ సింగ్ను ఆ అన్నదమ్ములు ఇద్దరూ బైక్పై తీసుకెళ్లి ఊరు చివర ఉన్న పంట పొలాల్లో పడేసి వచ్చారు.
అయితే గుర్తు తెలియని మృతదేహం ఉందనే సమాచారంతో వెళ్లిన పోలీసులు.. రంజోద్ సింగ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడి కాల్ డేటా.. సీసీ కెమెరాలను పరిశీలించి.. హర్దీప్ కన్నాను ప్రశ్నించారు. దీంతో ఆమె నిజం ఒప్పుకుంది. జరిగిన విషయం చెప్పేసింది. ఈ నేపథ్యంలో ఆమెను అదుపులోకి తీసుకున్న అధికారులు.. హర్దీప్ కన్నా కొడుకుల కోసం గాలింపు ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. కొడుకు మరణ వార్త తెలిసి రంజోద్ సింగ్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పెళ్లి పీటలెక్కాల్సిన కొడుకు విగత జీవిగా పడి ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయారు.