ఆ రైలు ఎక్కినవారికి దిగాలని అనిపించదు... ఫైవ్‌స్టార్ హోటల్‌కు ఏమాత్రం తీసిపోని ఆ రైలు మనదేశంలోనే ఉందని తెలిస్తే...

ABN , First Publish Date - 2022-11-29T09:47:05+05:30 IST

భారతీయ రైల్వేను ప్రజల జీవనరేఖ అంటారు. పేద తరగతి నుండి వ్యాపార తరగతి వరకు అందరూ తమ ప్రయాణానికి రైళ్లనే ప్రధానంగా ఎంచుకుంటారు.

ఆ రైలు ఎక్కినవారికి దిగాలని అనిపించదు... ఫైవ్‌స్టార్ హోటల్‌కు ఏమాత్రం తీసిపోని ఆ రైలు మనదేశంలోనే ఉందని తెలిస్తే...

భారతీయ రైల్వేను ప్రజల జీవనరేఖ అంటారు. పేద తరగతి నుండి వ్యాపార తరగతి వరకు అందరూ తమ ప్రయాణానికి రైళ్లనే ప్రధానంగా ఎంచుకుంటారు. భారతీయ రైళ్లలో ప్రయాణం రానురాను మరింత సౌకర్యవంతంగా, విలాసవంతంగా మారుతోంది. భారతీయ రైల్వే ప్రయాణీకుల ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేయడానికి ఎప్పటికప్పుడు అనేక మార్పులు చేస్తోంది. మన దేశంలో అత్యంత విలాసవంతమైన ఒక రైలు ఉంది. దానిలో కూర్చున్నవారికి బయటకు రావాలని అనిపించదు. ఈ రైలులో విలాసవంతమైన ఫైవ్ స్టార్ హోటల్‌లో ఉండే సౌకర్యాలన్నీ ఉన్నాయి.

ఆ రైలు పేరు గోల్డెన్ ఛారియట్ అంటే బంగారు రథం. ప్రపంచంలో ఉన్న లగ్జరీ రైళ్లలో గోల్డెన్ ఛారియట్ కూడా ఒకటి. ఈ రైలు ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్వర్ణ రథంలో ప్రయాణీకులకు స్పాతో సహా అనేక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. రైలు లోపలి భాగాన్ని ఫైవ్ స్టార్ అనుభూతిని అందించే విధంగా డిజైన్ చేశారు. ఈ రైలును 2008లో కర్ణాటక రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రారంభించింది.

కొన్నేళ్ల తరువాత ఈ రైలు పర్యవేక్షణను ఐఆర్టీసీ తన పరిధిలోకి తీసుకుంది. అప్పటి నుండి ప్రయాణికులను ఈ రైలు సేవలను అందిస్తోంది. రైలులోని అన్ని క్యాబిన్‌లు ఎయిర్ కండిషన్డ్ అయి ఉన్నాయి. అన్నింటిలో Wi-Fi సౌకర్యం అందుబాటులో ఉంది. గోల్డెన్ ఛారియట్ లోపల విలాసవంతమైన స్పా కూడా ఉంది, ఇందులో ప్రయాణీకులు ఆయుర్వేద మసాజ్‌లను ఆస్వాదించవచ్చు. 2013వ సంవత్సరంలో గోల్డెన్ ఛారియట్ ఆసియాలోనే ప్రముఖ లగ్జరీ రైలుగా అవార్డును అందుకుంది. రైలులో ప్రయాణీకులు అత్యుత్తమ కాక్‌టెయిల్‌లు, విభిన్న రుచుల పానీయాలను ఆస్వాదించవచ్చు. ఈ రైలులో ప్రయాణికులు బెంగళూరు, మైసూర్, హంపి, వెల్లూరు, కబిని, బాదామి, గోవాలను సందర్శించవచ్చు.

Updated Date - 2022-11-29T09:47:15+05:30 IST