చదివింది ఎం.కామ్.. 13 ఏళ్ల క్రితమే ప్రభుత్వోద్యోగం.. తండ్రి ఎంత చెప్పినా జాబ్‌లో చేరలేదు.. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏంటంటే..

ABN , First Publish Date - 2022-09-16T22:05:15+05:30 IST

ఆ వ్యక్తి పేరు.. మంజిత్ సింగ్. రాజస్థాన్‌ (Rajasthan)లోని శ్రీగంగానగర్‌కు చెందిన మంజిత్ ఎమ్‌ఏ, ఎమ్‌ఫిల్ చదివాడు.

చదివింది ఎం.కామ్.. 13 ఏళ్ల క్రితమే ప్రభుత్వోద్యోగం.. తండ్రి ఎంత చెప్పినా జాబ్‌లో చేరలేదు.. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏంటంటే..

ఆ వ్యక్తి పేరు.. మంజిత్ సింగ్. రాజస్థాన్‌ (Rajasthan)లోని శ్రీగంగానగర్‌కు చెందిన మంజిత్ ఎమ్‌ఏ, ఎమ్‌ఫిల్ చదివాడు. 13 ఏళ్ల క్రితమే ప్రభుత్వోద్యోగం అతడిని వెతుక్కుంటూ వచ్చింది. అయితే అతను ఆ ఉద్యోగంలో చేరలేదు. తండ్రి ఎంత చెప్పినా అతడు ఉద్యోగంలో చేరకుండా పొలం బాట పట్టాడు. తన జ్ఞానం మొత్తాన్ని పొలాలపై పెట్టుబడిగా పెట్టాడు. ప్రస్తుతం నెలకు లక్ష రూపాయలు, ప్రతి ఏటా 12 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, మెరుగైన నీటి నిర్వహణ తన విజయానికి కారణాలని మంజిత్ చెబుతున్నాడు. 


రాజస్థాన్ ఉత్తర ప్రాంతంలో ఉండే జిల్లా శ్రీ గంగానగర్. పాకిస్థాన్, పంజాబ్‌లకు ఆనుకుని ఉన్న ఈ ప్రాంతంలో వేసవి ఎండలు, శీతాకాలం చలి తీవ్రంగా ఉంటాయి. ఇక్కడ సగటు వర్షపాతం 20 మిమీ కంటే తక్కువే. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ప్రాంతంలో వ్యవసాయం చేయడం సవాలుతో కూడుకున్న పని. అయితే 47 ఏళ్ల మంజిత్ సింగ్ ఆ ప్రాంతంలో వ్యవసాయం ద్వారా భారీ లాభాలను ఆర్జిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు. మంజిత్ తన ఆరెకరాల పొలంలో సాంప్రదాయేతర వ్యవసాయ పద్ధతుల ద్వారా గోధుమలను, కూరగాయల మొక్కలను పండిస్తున్నాడు. కొత్త వ్యవసాయ పద్ధతులను తెలుసుకుని వాటిని అమలు చేస్తుంటాడు. 2005లో మంజీత్ వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. నాలుగేళ్లపాటు గోధుమలు, నర్మాలను పండించాడు. అయితే తొలి దశలో పెద్దగా విజయం సాధించలేదు. 


2009లో కూరగాయల మొక్కలు సిద్ధం చేయాలనే ఆలోచన వచ్చింది. సాంప్రదాయ వ్యవసాయంలో కూలీలు ఎక్కువగా ఉండి లాభాలు తగ్గిపోతున్నాయి. అందుకే రకరకాల ప్రయోగలు చేసి యంత్రాలతో వ్యవసాయం మొదలు పెట్టాడు. ముఖ్యంగా కూరగాయల మొక్కలు మంజిత్‌కు మంచి లాభాలను తెచ్చి పెట్టాయి. జనవరి నుంచి ఏప్రిల్ వరకు గోధుమలు పండిస్తాడు. జూన్ నుంచి నవంబర్ వరకు క్యాబేజీ, కాలీఫ్లవర్, మిరప, బెండకాయ, టమాటా మొక్కలను పండిస్తాడు. ఆగస్టులో ఉల్లిపాయ మొక్కలను తయారు చేస్తాడు. అవి అక్టోబర్, నవంబర్ నెలల్లో అమ్మకానికి వెళతాయి. గంగానగర్, హనుమాన్‌గఢ్, హర్యానాలోని ఫతేహాబాద్, పంజాబ్‌లోని అనేక జిల్లాల్లో తన కూరగాయల మొక్కలకు డిమాండ్ ఉందని మంజీత్ చెప్పారు. ఆయా ప్రాంతాల్లో రైతులు మంజిత్ నుంచి మొక్కలను కొనుగోలు చేసి కూరగాయలు పండించి విక్రయిస్తున్నారు. 

Read more