‘‘ఇంకోసారి ఇలా చేయను సార్.. ఇదొక్కసారి వదిలేయండి’’.. అంటూ వేడుకున్న యువతి.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-03-08T21:42:59+05:30 IST

బెంగళూరులో ఓ విద్యార్థిని చేసిన చిన్న తప్పు.. చివరకు చాలా దూరం వెళ్లింది. తప్పు చేసి దొరికిపోవడంతో ‘‘ఇంకోసారి ఇలా చేయను సార్.. ఇదొక్కసారి వదిలేయండి’’.. అంటూ వేడుకుంది. అయినా..

‘‘ఇంకోసారి ఇలా చేయను సార్.. ఇదొక్కసారి వదిలేయండి’’.. అంటూ వేడుకున్న యువతి.. అసలేం జరిగిందంటే..
ప్రతీకాత్మక చిత్రం

చాలా మంది తెలిసి కూడా తప్పులు చేస్తుంటారు. తీరా దొరికిపోయిన తర్వాత పశ్చాత్తాపపడుతుంటారు. కొందరు ముందు ఎలాంటి ఆలోచన లేకుండా తప్పులు మీద తప్పులు చేసి.. చివరకు పరువు పోయిందని ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. బెంగళూరులో ఓ విద్యార్థిని చేసిన చిన్న తప్పు.. చివరకు చాలా దూరం వెళ్లింది. తప్పు చేసి దొరికిపోవడంతో ‘‘ఇంకోసారి ఇలా చేయను సార్.. ఇదొక్కసారి వదిలేయండి’’.. అంటూ వేడుకుంది. అయినా ఫలితం లేకపోవడంతో చివరకు ఆమె తీసుకున్న నిర్ణయం.. అందరినీ షాక్‌కు గురి చేసింది. వివరాల్లోకి వెళితే..


బెంగళూరు జీవనబీమా నగర్ ముళబాగిలుకు చెందిన భవ్య(19).. బెంగళూరులోని ఓ ప్రైవేటు హాస్టల్లో ఉంటూ కోరమంగల జ్యోతినివాస్‌ కళాశాలలో బీకాం మొదటి సంవత్సరం చదువుతోంది. చాలా రోజులుగా వాయిదాపడుతూ వచ్చిన పరీక్షలను గత వారం నిర్వహించారు. విద్యార్థులంతా హాల్లో పరీక్ష రాస్తున్నారు. అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న కాపీ స్లిప్పులను బయటికీ తీసిన భవ్య.. దొంగచాటుగా రాయడం మొదలెట్టింది. ఈ క్రమంలో ఇన్విజిలేటర్లకు అనుమానం రావడంతో పరిశీలించగా దొరికిపోయింది. ‘‘ సార్ ఇదొక్కసారి వదిలేయండి సార్.. ఇంకోసారి ఇలా చేయను సార్’’.. అంటూ వారిని వేడుకుంది. అయినా వారు పట్టించుకోకుండా యువతిని డిబార్ చేశారు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైర భవ్య.. హాస్టల్‌కు వెళ్లి ఇంటికి ఫోన్ చేసింది. ‘‘కాపీ కొడుతూ దొరికిపోవడంతో డిబార్ చేశారు.. ఎంతో అవమానంగా ఉంది, నాకు బతకాలని లేదు’’.. అని చెప్పి ఫోన్ పెట్టేసింది.

అర్ధరాత్రి బస్సులో లైట్లు ఆర్పిన కండక్టర్.. ఇదే అదునుగా ఓ మహిళపై వెనుక నుంచి చేయి వేసిన వ్యక్తి.. చివరకు ఏం జరిగిందంటే..


దీంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు.. తిరిగి ఆమెకు ఫోన్ చేస్తే స్విచ్చాప్ అని వచ్చింది. వెంటనే యువతి ఉంటున్న హాస్టల్‌కు వచ్చేశారు. అయితే ఫోన్ పెట్టేసిన యువతి.. వెంటనే హాస్టల్ ఐదవ అంతస్తు పైనుంచి దూకేసింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విగతజీవిగా పడి ఉన్న భవ్యను చూసిన కుటుంబ సభ్యులు బోరున విలపించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తమ కుమార్తె మృతికి కళాశాల యాజమాన్యమే కారణమని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ భవ్య కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

టాటూ వేయించుకునేందుకు వెళ్లిన యువతి.. బయటికొచ్చి తన గోడును సోషల్ మీడియా ద్వారా వెళ్లబోసుకుంది..Read more