భర్తను వదిలి తల్లిదండ్రుల వద్ద ఉంటూ.. ఇటీవల ఆస్పత్రికి వెళ్లి ఆమె చేసిన నిర్వాకం.. భర్తకు తెలియడంతో..

ABN , First Publish Date - 2022-01-08T23:42:12+05:30 IST

భార్యాభర్తల మధ్య తలెత్తిన సమస్యలు.. చివరికి వారి కాపురంలోనే చిచ్చురేపాయి. భర్తను వదిలి తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయిన భార్య.. చివరకు భర్తకు తెలీకుండా చేసిన పని చివరకు పోలీసు కేసుల వరకూ వెళ్లింది. వివరాల్లోకి వెళితే..

భర్తను వదిలి తల్లిదండ్రుల వద్ద ఉంటూ.. ఇటీవల ఆస్పత్రికి వెళ్లి ఆమె చేసిన నిర్వాకం.. భర్తకు తెలియడంతో..
ప్రతీకాత్మక చిత్రం

ఏ సమస్య వచ్చినా భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు చర్చించుకుని సానుకూలంగా పరిష్కరించుకోవాలి. ఒకరిమాట ఒకరు వినకుండా ఉన్న సమయంలోనే సమస్యలు మొదలవుతాయి. కొన్నిసార్లు ఆ సమస్యలు చాలా పెద్దవి అవుతుంటాయి. మధ్యప్రదేశ్‌లో ఇలాగే జరిగింది. భార్యాభర్తల మధ్య తలెత్తిన సమస్యలు.. చివరికి వారి కాపురంలోనే చిచ్చురేపాయి. భర్తను వదిలి తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయిన భార్య.. భర్తకు తెలీకుండా చేసిన పని చివరకు పోలీసు కేసుల వరకూ వెళ్లింది. వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్ ఇండోర్ పరిధి మనిష్‌పురికి చెందిన ప్రకాష్ హర్యానీ అనే వ్యక్తి.. భార్య, కుమార్తె చాందిని హర్యానీతో కలిసి నివాసం ఉంటున్నాడు. చాందినిని రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన అమిత్ కటారియా అనే వ్యక్తికి ఇచ్చి కొన్నేళ్ల క్రితం వివాహం చేశారు. అమిత్ వృత్తిరిత్యా బిల్డర్ కావడంతో ఎలాంటి ఆర్థిక సమస్యలూ లేవు. అయితే కొన్నేళ్లు గడిచిన అనంతరం వివిధ సమస్యల కారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. రోజు రోజుకూ గొడవలు ఎక్కువవడంతో చాందిని 2020లో తన పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి తల్లిదండ్రులతోనే ఉంటోంది.

పెళ్లిరోజున భార్యపై ప్రేమ చూపించాల్సింది పోయి.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అతడు చెప్పిన మాట.. చివరకు అంతా షాక్..


ఈ క్రమంలో ఆమె తన భర్తపై వేధింపులు, గృహ హింస ఆరోపణలు చేస్తూ రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు నడుస్తున్నప్పటికి ఆమె గర్భిణిగా ఉంది. అయితే అబార్షన్ చేయించుకోవాలనే ఉద్దేశంతో తన తండ్రి సలహాతో సమీపంలోని గైనకాలజిస్టును సంప్రదించారు. అప్పటికే ఆరు వారాల గర్భిణిగా ఉన్న ఆమె కడుపులో కవలలు ఉండడాన్ని వైద్యులు గుర్తించారు. అయితే చాందిని, ఆమె తండ్రి బలవంతం మీద అబార్షన్ చేశారు. కొన్ని నెలల తర్వాత ఈ విషయం చాందిని భర్తకు తెలిసింది. దీంతో గత ఏడాది పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గురువారం ఈ కేసుపై పోలీసులు స్పందించారు. భర్తకు తెలీకుండా అబార్షన్ చేయడంపై వైద్యురాలితో పాటూ చాందిని, ఆమె తండ్రిపై కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

వదినను ఏకాంతంగా కలిసిన మరిది.. మద్యం మత్తులో అతడు చెప్పిన ఒక్క మాటతో.. తెల్లవారుజామున లేచి చూస్తే..

Updated Date - 2022-01-08T23:42:12+05:30 IST