Babli Bouncer: బాబ్లీ బౌన్సర్ సినిమాగా వచ్చిన విలేజ్ ఆఫ్ బౌన్సర్ల అసలు కథ ఇదే..!

ABN , First Publish Date - 2022-09-26T19:45:15+05:30 IST

సెలబ్రెటీల వెనుక హఢావుడిగా కండలు తిరిగి కనిపిస్తూ, వాళ్ళకు రక్షణగా ఉండే కండల వీరుల వెనుక ఓ గ్రామం మొత్తం ఉందట..

Babli Bouncer: బాబ్లీ బౌన్సర్ సినిమాగా వచ్చిన విలేజ్ ఆఫ్ బౌన్సర్ల అసలు కథ ఇదే..!

సెలబ్రెటీల వెనుక నిటారుగా నిలబడి కండలతో ధీరులుగా కనిపించే బౌన్సర్లు ప్రతి ప్రముఖుల ఫంక్షన్ లలోనూ, ఖరీదైన పబ్బులలోనూ రక్షణగా ఉంటూ జనాన్ని కంట్రోల్ చేస్తూ కనిపిస్తారు. ఈ కండలు తిరిగి కనిపిస్తున్న, వాళ్ళ వీరుల వెనుక ఓ గ్రామం మొత్తం ఉందట.. ఢీల్లీ పరిసర ప్రాంతాల్లో పబ్బుల్లో, పారిశ్రామిక వేడుకలు ఏం జరిగినా అక్కడ బౌన్సర్ల హఢావుడి ఉండాల్సిందే..ప్రముఖలు, VIPలకు రక్షణగా ఉంటూ వస్తున్న బౌన్సర్లకు పెద్ద కథే ఉంది దాని విశేషాలు తెలుసుకుందాం. 


ఈ మధ్యే వచ్చిన మధుర్ భండార్కర్ దర్శకత్వం వహించిన చిత్రంలో తమన్నా భాటియా బాబ్లీ బౌన్సర్స్ చిత్రంలో మహిళా బౌన్సర్‌గా నటించింది. ఈ చిత్రంలో 'విలేజ్ ఆఫ్ బౌన్సర్స్'గా ప్రసిద్ధి చెందిన ఫతేపూర్ బేరి అనే గ్రామం నుండి వచ్చిన మహిళా బౌన్సర్ పాత్రలో ఆమె కనిపిస్తుంది. 


అసోలా-ఫతేపూర్ బేరి ఢిల్లీ శివార్లలో ఉన్న ఒక గ్రామం. ఈ గ్రామం ప్రత్యేకత ఏమిటంటే.. ఇక్కడి పురుషుల జనాభాలో ఎక్కువ మంది తమ జీవితాలను బాడీబిల్డింగ్, ఫిట్ నెస్ కు అంకితం చేసేసి ఉంటారు. ఇది ఇప్పటి కాలంలో మొదలైంది కాదు తరతరాలుగా ఇక్కడి మగవారు యుక్తవయసు రావడానికి ముందు నుంచే కండలు పెంచడానికి శరీరాన్ని దృఢంగా మార్చుకోవడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. దీనికోసం ప్రతిరోజూ కఠినమైన వ్యాయామాలు చేస్తూ, ప్రత్యేకమైన ఆహారాన్ని తీసుకోవడానికి సిద్ధమవుతారు. 


ది కంట్రీ ఆఫ్ మజిల్‌మెన్: ఢిల్లీ శివార్లలోని ఒక గ్రామం నగరంలోని పబ్బులు, పార్టీలు, నైట్‌క్లబ్‌లను రక్షించే యువకులను అందిస్తుంది. వీళ్ళు పెళ్లిళ్లు, సినిమా షూట్‌లు, మాల్స్‌తో పాటు స్కూళ్లు, కాలేజీలకు కూడా కండలవీరులను అందిస్తుంది. ఆకట్టుకునే శరీరాకృతి వీరి సొంతం. అంతే కాదు ఎటువంటి నేర చరిత్ర వీరికి ఉండకూడదు. అలాంటి వారినే ఎంచుకుంటారు. 


ముఖ్యంగా ఢీల్లీలో బౌన్సర్ లుగా ఉండాలంటే మట్టి కుస్తీ, రోప్ క్లైంబింగ్, ఇలాంటి  అన్నిరకాల శారీరక వ్యాయామాలు వచ్చి ఉండాలి. వీరికి ప్రతిరోజు దాదాపు నాలుగు గంటలు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అసోలా ఫతేపూర్ బెరీ నుంచి వచ్చిన కండల వీరులకు హై ఎండ్ ఢిల్లీ నైట్ క్లబ్లలలో బౌన్సర్లుగా డిమాండ్ కూడా ఎక్కువే. 


కొన్నేళ్ళ క్రితం గ్రామంలోని ప్రముఖ శిక్షణా స్థలంలో ప్రధాన ట్రైనర్ గా పని చేసిన విజయ్ తన్వరా, ఈ ట్రెండ్ ను ప్రారంభించాడు. ఆ గ్రామం నుంచి బౌన్సర్ గా మారిన మొదటి వ్యక్తులలో ఈయన ఒకడు. తన్వర్ మొదట ఒలింపిక్ రెజ్లర్ గా శిక్షణ తీసుకున్నాడు. కానీ అనుకున్నట్టుగా అతనికి అవకాశం దక్కకపోయే సరికి ఉద్యోగ వేటలో బౌన్సర్ గా స్థిరపడిపోయాడు.


50,000 జనాభా కలిగిన ఈ గ్రామాల నుండి 200 మంది యువకులు, దేశ రాజధానిలోని బార్‌లు, నైట్‌క్లబ్‌లను రక్షించడానికి, ప్రైవేట్ కళాశాలలకు భద్రత కల్పించడానికి, వ్యాపారవేత్తలకు కాపలాగా ఉండే కండరాలుగా వెళతారు. పాస్టోరల్ గుజ్జర్ కమ్యూనిటీ ఆధిపత్యంలో ఉన్న ఈ గ్రామంలో 'బౌన్సరీ', వారుగా పిలుస్తారు. ఇది గౌరవప్రదమైన వృత్తిగా భావిస్తారు. వీరిలో చాలా మంది తమ పూర్వీకులను పూజిస్తారు. వీళ్ళకు తన్వర్ అనే ఇంటిపేరు ఉంటుంది. 

Updated Date - 2022-09-26T19:45:15+05:30 IST