Asian Archer Fish : ఈ ఫిష్ టార్గెట్ చేస్తే ఫినిష్!

ABN , First Publish Date - 2022-11-05T14:18:43+05:30 IST

నమ్మశక్యం కాని విధంగా 1.5 మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను చేధింగలుగుతాయి.

Asian Archer Fish : ఈ ఫిష్ టార్గెట్ చేస్తే ఫినిష్!
fish

ఆర్చర్ ఫిష్ దీని శాస్త్రీయ నామం టాక్సోట్స్ జాక్యులేటర్. ఇది ఎరను పట్టుకునే విధానం కొత్తగా ఉంటుంది. ప్రత్యేకమైన దీని వేటాడే పద్దతి వల్ల ఈ చేపలు అక్వేరియం చేపలుగా మారిపోయాయి. సాధారణంగా చేపలు నీటిలో ఉండే చిన్న చిన్న పురుగుల్ని తింటూ ఉంటాయి. లేదా అక్వేరియంలో పెరిగే చేపలయితే తొట్టిలో వేసే ఆహారాన్ని తింటూ ఉంటాయి. కానీ ఈ ఆర్చర్ ఫిష్ మాత్రం కాస్ ప్రత్యేకం.

ఇతర చేపలకు కాస్త భిన్నంగా వేటాడుతుంది అదెలాగంటే దీని అద్భుతమైన కంటి చూపుతో నీటిలోంచి పైన చెట్ల మీద ఉన్న చిన్న చిన్న కీటకాలను పసిగడతాయి. నోటితో నీటిని పట్టి దానిని పిస్టల్ లాంటి జెట్ స్పీడుతో కొమ్మ మీది కీటకాలమీదకు ఊస్తుంది. కొమ్మ మీద నుంచి కీటకం నీటిలోనికి పడేయగానే ఆర్చర్ ఫిష్ నోటకరుచుకుంటుంది.

చాలా చేపలతో పోల్చితే ఈ ఆర్చర్ చేపలు అద్భుతమైన కంటి దృష్టిని కలిగి ఉంటాయి. ఈ చూపుతోనే నీటి ఉపరితలం పైన ఉండే కీటకాలను వేటాడతాయి. ఆహారానికి, వాటికి మధ్య ఉన్న దూరాన్ని కళ్లతోనే అంచనా వేస్తాయి. నమ్మశక్యం కాని విధంగా 1.5 మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను చేధింగలుగుతాయి. మొదటి ప్రయత్నంలో లక్ష్యం తప్పినట్లయితే వెంట వెంటనే ఏడు సార్లు ప్రయత్నిస్తుంది.

ఆర్చర్ చేపలు తూర్పు ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియాలలో విస్తృతంగా కనిపిస్తాయి. ఉప్పు నీరు, మంచి నీరు రెండింటిలోనూ నివసిస్తాయి. ముఖ్యంగా ఉప్పునీటి మడ అడవులలో ఎక్కువగా ఉంటాయి. మడ అడవులు దురదృష్టవశాత్తు అభివృద్ది పేరుతో మాయం కావడంతో ఈ ఆర్చర్ చేపల పరిస్థితి ప్రమాదంలో పడింది.

ఆర్చర్ చేప ప్రత్యేకతలు..

1. ఇది ఉపరితలం నుండి 5 అడుగుల వరకు గురి చూసి నీటితో షూట్ చేస్తుంది. అదే ఆర్చర్ చేపను ఆక్వేరియంలో పెంచి ఆహారాన్ని అందిస్తూ ఉంటే క్రమేణా వేటాడే తత్వాన్ని మరిచిపోతాయి.

2. ఆర్చర్ ఫిష్ శాస్త్రీయ నామం లాబ్రస్ జాకులేటర్. కొన్నిసార్లు, వాటిని "స్పిన్నర్ ఫిష్" అని కూడా పిలుస్తారు.

3. ఆర్చర్ ఫిష్ పెర్సిఫార్మ్స్(Perciformes) క్రమంలో ఉన్నాయి, ఇది సకశేరుకాల అతిపెద్ద క్రమం, మొత్తం అస్థి చేపలలో 41% ఉంటుంది. ఈ ఆర్డర్‌లో 160 కుటుంబాలు ఉన్నాయి. ప్రత్యేకంగా, ఆర్చర్ ఫిష్ టోక్సోటిడే కుటుంబం, టోక్సోట్స్ జాతికి చెందినది, వీటిలో 10 జాతులు మాత్రమే ఉన్నాయి.

Updated Date - 2022-11-05T14:29:09+05:30 IST