చాణక్యనీతి: జీవితంలో ఈ 7 పొరపాట్లు జరగకుండా చూసుకోండి.. లేదంటే కష్టాలు వెంటాడుతాయి

ABN , First Publish Date - 2022-05-02T12:20:27+05:30 IST

ఎకనామిక్స్ అయినా, మ్యాథమేటిక్స్ అయినా...

చాణక్యనీతి: జీవితంలో ఈ 7 పొరపాట్లు జరగకుండా చూసుకోండి.. లేదంటే కష్టాలు వెంటాడుతాయి

ఎకనామిక్స్ అయినా, మ్యాథమేటిక్స్ అయినా, మెడికల్ సైన్స్ అయినా.. భారతీయులు ప్రతి రంగంలో తమ ఔన్నత్యాన్ని చాటుతున్నారు. పూర్వకాలంలో రాజులు వారి పాలనా కాలంలో చాణక్య విధానాల ద్వారా రాజ్య పాలన పర్యవేక్షించేవారు. చాణక్యుడు తెలిపిన జీవన విధానం జీవితాన్ని ఆనందమయంగా మారుస్తుంది. కొన్ని విషయాల్లో మనిషి పొరపాటున కూడా జోక్యం చేసుకోకూడదు. అలా కాదని వ్యవహరిస్తే జీవితంలో ఇబ్బందులు చుట్టుముడతాయని ఆచార్య చాణక్య తెలిపారు. ఆ విషయాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

1. అగ్నిని తాకవద్దు

హిందూ నమ్మకాల ప్రకారం అగ్నిని చాలా స్వచ్ఛమైనదిగా పరిగణిస్తారు. అగ్నిని దేవతగా పరిగణిస్తారు. ఏదైనా శుభకార్యం చేస్తున్నప్పుడు అగ్నిని సాక్షిగా భావించి ప్రమాణం చేస్తారు. మీరు పొరపాటునైనా అగ్నిని తాకితే దాని ప్రభావం మీ మీద పడుతుంది. అందుకే అగ్నికి దూరంగా ఉండాలని ఆచార్య చాణక్య తెలిపారు. 

2. పెళ్లికాని అమ్మాయిని తాకవద్దు

చాణక్య నీతి ప్రకారం పురుషుడు పెళ్లికాని అమ్మాయిని తాకకూడదు. కన్య అయిన అమ్మాయిని దేవతతో సమానంగా పరిగణిస్తారు. అనుకోకుండా అమ్మాయిని తాకితే వెంటనే క్షమాపణలు చెప్పండి. అలా చేయని పక్షంలో ఇబ్బందుల్లో పడే అవకాశాలున్నాయి. 


3. ఆధ్యాత్మిక గురువుతో ఆటలొద్దు

హిందువుల నమ్మకం ప్రకారం గురువు.. తల్లిదండ్రుల కంటే ఉన్నతుడు. గురువును ఎల్లప్పుడూ గౌరవించాలి. గురువును అవమానించచే వారు నాశనమవుతారని ఆచార్య చాణక్య తెలిపారు. 

4. బ్రాహ్మణులను గౌరవించండి

హిందూ మతంలో బ్రాహ్మణుల ప్రాముఖ్యత గురించి పేర్కొన్నారు. సమాజంలో బ్రాహ్మణుల స్థితి చాలా ఉన్నతమైనది. కాబట్టి బ్రాహ్మణును నిందించకండి. వారితో వివాదం పెట్టుకోవడం మంచిది కాదని ఆచార్య చాణక్య తెలిపారు. 

5. పెద్దవారిని గౌరవించండి

ఇంటిలోని పెద్దలను ఎప్పుడూ గౌరవించాలి. పొరపాటున కూడా వారితో విబేధాలు పెట్టుకోవద్దు. పెద్దలను గౌరవించని ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉండదు.

6. మీ పిల్లలను అనవసరంగా కొట్టవద్దు

చాణక్య నీతి ప్రకారం హిందూ ధర్మంలో పిల్లలలను భగవంతుని స్వరూపంగా భావిస్తారు. పిల్లలను అనవసరంగా ఎప్పుడూ కొట్టకూడదని ఆచార్య చాణక్య తెలిపారు. 

7. ఆవును ఎప్పుడూ కొట్టవద్దు

హిందూ ధర్మంలో ఆవును తల్లిగా భావిస్తారు. ఆవు పాలను స్వచ్ఛమైనవిగా భావిస్తారు. ఆవును ఎప్పుడూ కొట్టకూడదు. మీరు పొరపాటున అలా చేసినట్లయితే పశ్చాత్తాపం చెందాలని ఆచార్య చాణక్య తెలిపారు.Updated Date - 2022-05-02T12:20:27+05:30 IST