భవనంపైకి ఎక్కి కూర్చున్న వ్యక్తి.. రక్షించేందుకు ప్రయత్నించిన పోలీసులు.. చివరకు..

ABN , First Publish Date - 2022-07-10T02:06:29+05:30 IST

కొందరు ఎన్ని చోరీలు చేసినా తెలివిగా తప్పించుకుని తిరుగుతుంటారు. అయితే కొన్నిసార్లు టైమ్ బాలేని సమయంలో ప్రజలకు చిక్కి చావు దెబ్బలు తింటుంటారు. మరికొందరు దొంగలు..

భవనంపైకి ఎక్కి కూర్చున్న వ్యక్తి.. రక్షించేందుకు ప్రయత్నించిన పోలీసులు.. చివరకు..

కొందరు ఎన్ని చోరీలు చేసినా తెలివిగా తప్పించుకుని తిరుగుతుంటారు. అయితే కొన్నిసార్లు టైమ్ బాలేని సమయంలో ప్రజలకు చిక్కి చావు దెబ్బలు తింటుంటారు. మరికొందరు దొంగలు పోలీసులకు చిక్కకుండా వివిధ రకాల ఎత్తులు వేస్తుంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి వారి ప్రాణాలకే ప్రమాదం జరుగుతుంటుంది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ముంబైలో ఓ వ్యక్తి ఇలాగే చేశాడు. దొంగతనం చేయడానికి వచ్చిన వ్యక్తిని స్థానికులు గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఆ వ్యక్తి పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు భవనం పైకి ఎక్కేశాడు. పోలీసులు ఎంత బ్రతిమాలినా దిగలేదు. చివరకు ఏమైందంటే..


ముంబైలోని మెరైన్ లైన్స్‌లో ఉన్న భవనంలోకి రోహిత్ అనే వ్యక్తి శుక్రవారం దొంగతనం చేసేందుకు వచ్చాడు. అయితే స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకున్న విషయం తెలుసుకున్న దొంగ.. వారి నుంచి తప్పించుకునేందుకు తెలివిగా భవనం పైకి ఎక్కేశాడు. కిటిటీ నుంచి భవనం వెలుపలకు వెళ్లి.. అక్కడి నుంచి దూకేస్తానంటూ బెదిరించాడు. పోలీసులు ఎంత నచ్చజెప్పినా వినలేదు.

NASA: నాసా శాస్త్రవేత్తల వింత ఆచారం.. రాకెట్ ప్రయోగానికి ముందు అవి తిని తీరాల్సిందేనట.. లేదంటే..


చివరకు అగ్నిమాపక సిబ్బందిని కూడా రప్పించారు. అంతా కలిసి భవనం కింద వలను ఏర్పాటు చేశారు. అతన్ని అదుపులోకి తీసుకోవాలని సుమారు రెండు మూడు గంటలు ప్రయత్నాలు చేసినా కుదరలేదు. చివరకు అనూహ్యంగా ఆ వ్యక్తి.. ఒక్కసారిగా భవనం కిందకు దూకేశాడు. తీవ్ర గాయాలపాలైన అతన్ని.. చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ప్రియుడితో ఉన్న కూతురిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న తల్లి.. 18ఏళ్లు నిండగానే పెళ్లి చేసుకుంటానని యువకుడు చెప్పడంతో.. చివరకు...

Read more