చాణక్య నీతి: శునకం నుండి మనిషి నేర్చుకోవాల్సిన విజయ రహస్యాలు
ABN , First Publish Date - 2022-06-28T12:45:19+05:30 IST
విజయవంతమైన జీవితం అందుకునేందుకు...

విజయవంతమైన జీవితం అందుకునేందుకు చాలామంది ఆచార్య చాణక్యుని విధానాలను అనుసరిస్తుంటారు. ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం మనిషి నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. మనిషి.. శునకం నుంచి కూడా నేర్చుకోవాల్సిన అనేక విషయాలున్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిద్రలోనూ అప్రమత్తత
ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం ఒక వ్యక్తి శునకం మాదిరిగా నిద్రలోనూ అప్రమత్తంగా ఉండాలి. తద్వారా మనిషి అన్ని సందర్భాల్లోనూ నిపుణునిగా వ్యవహరించగలుగుతాడు. చిన్నపాటి శబ్దం వచ్చినా వెంటనే శునకం మేల్కొంటుంది. ఈ విధంగానే మనిషి మెలగాలి.
స్వామి భక్త
ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం ఒక వ్యక్తి శునకం మాదిరిగా స్వామి భక్తి ప్రకటించాలి. శునకం తన యజమాని దగ్గర ఎంతో నమ్మకంగా మెలుగుతుంది. ఈ విధంగానే మనిషి తన యజమానికి లేదా సంస్థకు విధేయునిగా ఉండాలి.
నిర్భయం
శునకాలు ఎంతో ధైర్యాన్ని ప్రదర్శిస్తాయి. తమ యజమానికి ఏదైనా హాని జరిగితే, అవి అతనిని కాపాడేందుకు ప్రయత్నిస్తాయి. మనిషి ఇటువంటి లక్షణంతో ప్రతి సమస్యను ఎంతో ధైర్యంగా, దృఢంగా ఎదుర్కోవాలి.
సంతృప్తి
ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం శునకానికి ఏ ఆహారం ఇచ్చినా దానితో అది సంతృప్తి చెందుతుంది. ఇదేవిధంగా మనిషి తనకు లభించిన ఆహారంతో సంతృప్తి చెందాలి. అతిగా ఆశించడం అనర్థాన్ని తెస్తుందని ఆచార్య చాణక్య హెచ్చరించారు.