chanakya niti: ఈ అల‌వాట్లు సంసారాన్ని రోడ్డున ప‌డేస్తాయి... భార్యాభ‌ర్త‌ల్లో ఎవ‌రికి ఈ దుర్గుణాలు ఉన్నా త‌లెత్తుకోలేరు!

ABN , First Publish Date - 2022-12-15T06:59:54+05:30 IST

ఆచార్య చాణక్యుడు దౌత్యం, వ్యూహాలకు ప్రసిద్ధి చెందాడు. ఆయన విధానాలను అనుసరించి ఎంతో మంది విజ‌యం సాధించారు. ఆచార్య చాణక్యుడి విధానాల ఆధారంగా ఒక సాధారణ బాల చంద్రగుప్తుడు మౌర్య చక్రవర్తి అయ్యాడు.

chanakya niti:  ఈ అల‌వాట్లు సంసారాన్ని రోడ్డున ప‌డేస్తాయి... భార్యాభ‌ర్త‌ల్లో ఎవ‌రికి ఈ దుర్గుణాలు ఉన్నా త‌లెత్తుకోలేరు!

ఆచార్య చాణక్యుడు దౌత్యం, వ్యూహాలకు ప్రసిద్ధి చెందాడు. ఆయన విధానాలను అనుసరించి ఎంతో మంది విజ‌యం సాధించారు. ఆచార్య చాణక్యుడి విధానాల ఆధారంగా ఒక సాధారణ బాల చంద్రగుప్తుడు మౌర్య చక్రవర్తి అయ్యాడు. మగధను పాలించాడు. చాణక్య నీతి అనేది ఆచార్య చాణక్యుడి విధానాల సమాహారం. దీనిలో మ‌నిషి జీవితంలో విజయం సాధించడానికి అనేక నియమాలు ఉన్నాయి. దీనితో పాటు చాణక్య నీతిలో వైవాహిక జీవితంలో ఆనందాన్ని ఎలా పొంద‌వ‌చ్చో తెలియ‌జేశారు. భార్యాభర్తల మధ్య అనుబంధం దృఢంగా, సంతోషంగా ఉంటే జీవితంలో ఎలాంటి సమస్య ఉండదు. కాగా భార్యాభర్తల మధ్య ఉండే కొన్ని అలవాట్లు వారి మ‌ధ్య దూరాన్ని సృష్టిస్తాయి. భార్యాభర్తల మధ్య బంధాన్ని దూరం చేసే అలవాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

నమ్మకం

భార్యాభర్తల మధ్య బంధం ప‌ర‌స్ప‌ర న‌మ్మ‌కంపై ఆధార‌ప‌డి ఉంటుంది. భార్యాభ‌ర్త‌ల సంబంధంలో సందేహాల గోడ ఏర్ప‌డ‌కూడ‌దు. జీవిత భాగస్వామి మనసులో సందేహాన్ని కలిగించే పనులు ఇద్ద‌రూ చేయ‌కూడ‌దు. ఏదైనా సందేహం ఉంటే, సంకోచించకుండా భాగ‌స్వామిని అడ‌గాలి.

అహంకారం

ప్రతి సంబంధాన్ని నాశనం చేసే శక్తి అహంకారానికి ఉంది. భార్యాభర్తల మధ్య సంబంధంలో దీనికి తావు ఉండ‌కూడ‌దు. చాణక్య విధానం ప్రకారం, భార్యాభర్తలు ఎప్పుడూ ఒకరినొకరు గౌరవించుకోవాలి. పొరపాటున కూడా వారి సంబంధం మధ్య అహంకారం త‌లెత్త‌కూడ‌దు. ఎందుకంటే అహంకారం త‌లెత్తితే దంప‌తుల మ‌ధ్య బంధం ఎక్కువ కాలం నిలవదు.

అబద్ధం

భార్యాభర్తలు ఎప్పుడూ ఒకరి నుండి ఒకరు ఏ విషయాన్నీ దాచకూడదు. ఎందుకంటే వారి బంధం నమ్మకంపై ఆధారపడి ఉంటుంది.ప‌ర‌స్ప‌రం అబద్ధాలు చెప్పుకునే భార్యాభర్తలు త‌మ బంధాన్ని పాడు చేసుకున్న‌వార‌వుతారు. ఏదోఒక రోజు నిజం బయటప‌డితే దాంప‌త్య బంధం విచ్ఛిన్న‌మ‌వుతుంది.

గోప్య‌త‌

భార్యాభర్తలు త‌మ వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను ఎప్పుడూ నాలుగు గోడల మధ్యే చర్చలు జరపాలి. ఇంటికి సంబంధానికి సంబంధించిన విషయాలను ఇంటి బయట ఎవరితోనూ ఎప్పుడూ చెప్ప‌కూడ‌దు. ఇలా చేస్తే ఇత‌రులు వారిని అవ‌హేళ‌న చేసే అవ‌కాశం ఉంది. ఈ అల‌వాటు భార్యాభ‌ర్త‌ల బంధాన్ని చెడ‌గొడుతుంది.

Updated Date - 2022-12-15T06:59:56+05:30 IST