Viral Video: బాటిల్ కప్ మీద ప్రయాణం కోసం కప్పల మధ్య ఫైటింగ్.. చివరకు ఏం జరిగిందో చూడండి..
ABN , First Publish Date - 2022-08-14T18:31:08+05:30 IST
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వీడియోలు నెటిజన్లను అలరిస్తున్నాయి.

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వీడియోలు నెటిజన్లను అలరిస్తున్నాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన ఆసక్తికర, ఫన్నీ వీడియోలు ఎక్కువ మందిని ఆకట్టుకుంటున్నాయి. తాజాగా కప్పలకు సంబంధించిన ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ (Viral Video) అవుతోంది. Buitengebieden ట్విటర్ హ్యాండిల్‌పై ఈ వీడియో షేర్ అయింది.
ఈ వీడియోలో.. నీటిపై తేలుతూ ముందకు వెళుతున్న సీసా మూతపై ఓ కప్ప (Frog) ఉంది. మరొక కప్ప కూడా దాని మీదకు ఎక్కడానికి ప్రయత్నిస్తోంది. అయితే మీద ఉన్న కప్ప కింద ఉన్న కప్పను పైకి రానివ్వడం లేదు. అది పైకి రావడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కాలితో కిందకు తోసేస్తోంది. ఈ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేస్తూ Final scene of the Titanic.. అని కామెంట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటికి 1.30 కోట్ల మంది వీక్షించారు.