Sandhill Crane: ఈ కొంగలు ఆహారం కోసం రోజుకు 500 మైళ్లు ప్రయాణిస్తాయట..
ABN , First Publish Date - 2022-11-30T10:37:47+05:30 IST
ఆహారం తక్కువగా దొరకడం, వేటాడబడటం వల్ల ఇవి ప్రమాదంలో ఉన్నాయి.
శాండ్‌హిల్ క్రేన్ ప్రపంచంలో పెద్ద క్రేన్ జాతి. ఇవి పెద్ద పక్షులు అలాగే పొడవాటి మెడ, కాళ్ళు, ఆకట్టుకునే రెక్కలు, పొడవైన కోణాల ముక్కు కలిగి ఉంటాయి. తల మీద పెద్దవి ఎరుపు రంగు కిరీటాలతో బూడిద రంగులో ఉంటాయి. శాండ్‌హిల్ క్రేన్ ఉత్తర కెనడా నుండి ఉత్తర మెక్సికో వరకు ఉత్తర అమెరికా అంతటా విస్తరించి కనిపిస్తాయి. శాండ్‌హిల్ క్రేన్‌లు పాక్షికంగా వలస వెళ్ళే జాతి, సంతానోత్పత్తి తరువాత నైరుతి యునైటెడ్ స్టేట్స్, మెక్సికోలకు వలసపోతాయి. సాండ్‌హిల్ క్రేన్‌లు వివిధ రకాల బహిరంగ ఆవాసాలలో నివసిస్తాయి, ప్రధానంగా బోగ్‌లు, ఫెన్స్, సెడ్జ్ పచ్చిక భూములు, అలాగే పైన్ సవన్నా, గడ్డి భూములు మంచినీటి చిత్తడి నేలలలో ఎక్కువగా ఉంటాయి.

అలవాట్లు, జీవనశైలి
శాండ్‌హిల్ క్రేన్‌లు సాధారణంగా జంటగా, కుటుంబ సమూహాలలో నివసిస్తాయి. శాండ్‌హిల్ క్రేన్‌లు ప్రధానంగా రకరకాల అరుపులు, నాట్య ప్రదర్శనల ద్వారా కమ్యూనికేట్ చేస్తాయి. వీటిని ట్రిల్స్, పర్ర్స్ , రాటిల్ (trills, purrs and rattles)రకాలుగా పిలుస్తారు. ఇవి తరచుగా బిగ్గరగా, ట్రంపెటింగ్ కూతలు కూస్తాయి. శాండ్‌హిల్ క్రేన్‌లు ప్రధానంగా శాకాహారులు, అయితే దొరికిన ఆహారాన్ని బట్టి వివిధ రకాలను తింటాయి. ఇవి మొక్కజొన్న, గోధుమలు, పత్తి గింజలు, జొన్న వంటి పండించిన ఆహారాన్ని సులభంగా తింటాయి. ఈ మొక్కజొన్న వలసలకు సిద్ధమవుతున్న కొంగలకు ఉపయోగపడుతుంది, సుదీర్ఘ ప్రయాణానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.

1. శాండ్‌హిల్ క్రేన్‌లు జత కట్టిన పక్షితోనే సాధారణంగా జీవితాంతం కలిసి ఉంటాయి, డిసెంబర్ నుండి ఆగస్టు వరకు ఎప్పుడైనా గుడ్లు పెడతాయి. వాటిని 29 నుండి 32 రోజుల వరకు పొదిగుతాయి.
2. ఈ పక్షులు మైదానాల చుట్టూ అభివృద్ధి చేయడం వలన ఈ వలస పక్షులకు హాని కలుగుతుంది. నివాస క్షీణత, ఆహారం తక్కువగా దొరకడం, వేటాడబడటం వల్ల ఇవి ప్రమాదంలో ఉన్నాయి.

3. శాండ్‌హిల్ క్రేన్‌లు డ్యాన్స్‌లో చాలా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాయి. ఈ క్రేన్‌లు రెక్కలను చాచి, తలను పైకి క్రిందికి వంచి, వంగి, గాలిలోకి దూకి, మనోహరంగా నృత్యం చేస్తాయి.
4. 2.5 మిలియన్ సంవత్సరాల పురాతనమైన శాండ్‌హిల్ క్రేన్ తొలి శిలాజం ఫ్లోరిడాలో మకాస్‌ఫాల్ట్ షెల్ పిట్ (Macasphalt Shell Pit) లో లభించింది.
5. కొన్ని క్రేన్ జాతులు ఆహారం కోసం రోజుకు 500 మైళ్లు (804 కిమీ) దూరం ప్రయాణిస్తాయి.