Intelligent Dog Breeds: ప్రపంచంలోనే అత్యంత తెలివైన డాగ్ బ్రీడ్స్ ఇవే...!

ABN , First Publish Date - 2022-10-07T16:33:36+05:30 IST

కుక్కలు యజమానికి విశ్వాసంగా ఉంటాయి. వీటిలో కొన్ని వేటకు ఎక్కువ సహాయంగా ఉంటాయి.

Intelligent Dog Breeds: ప్రపంచంలోనే అత్యంత తెలివైన డాగ్ బ్రీడ్స్ ఇవే...!

ఇల్లంతా గంతులు వేస్తూ చిన్న బొచ్చుతో తిరుగుతూ ఉండే కుక్కలు ఇంటికి కాపలాతో పాటు, సందడి తెస్తాయి. వీటిని స్టేటస్ సింబల్ గా కూడా పెంచుతారు. కుక్కల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ప్రత్యేకంగా వేట కోసం మాత్రమే పెంచుతారు. మరికొన్ని పెంపుడు జంతువులుగానే ఉంటూ, వేటలో కూడా శిక్షణ కలిగి ఉంటాయి మరి అలాంటి వేట శిక్షణ కలిగిన 10 రకాల కుక్క జాతులు, వాటి లక్షణాల గురించి తెలుసుకుందాం. 


1. ఓల్డ్ ఇంగ్లీష్ షీప్ డాగ్ (Old English Sheepdog)

ఆకారంలో అందంగా, బొద్దుగా కనిపించే ఈ కుక్కలు ఒళ్ళంతా పూర్తిగా బొచ్చుతో కప్పేసి ముఖాలు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కళ్ళు కనిపించకుండా ముఖం మీదకు పడే బొచ్చుతో వీటికి ప్రత్యేకమైన గుర్తింపు, ఆకర్షణగా నిలుస్తాయి. ఈ షీప్ డాగ్ ను ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో జంతువుల మందలకు కాపలాగా ఉంచేవారు. ఇందులోని ఆడ కుక్కలు మగవాటి కంటే కొంచెం తక్కువ ఎత్తులో ఉంటాయి. ఇందులో మగ కుక్కలు 46 కిలోలవరకూ బరువుతో పెరుగుతాయి.



2. బ్రీడ్ కోలీ (Bearded Collie)

ఫీప్ డాగ్స్, బార్డెడ్ కోలీస్ కు తెలివితేటల పరంగా చాలా పోలికలు ఉంటాయి. వీటిని ఇంగ్లాండ్, స్కాట్లాండ్ దేశాలలో ఎక్కువగా పెంచుతారు. వీటికి శారీరక శ్రమ కావాలి. అవి ప్రవర్తనలో చాలా భిన్నంగా ఉంటాయి. కోల్లీస్ ప్రకృతిలో ఉల్లాసంగా తిరుగాడుతూ ఉంటాయి. ఇవి యజమానులకు మంచి విశ్వాసంగా ఉంటాయి. వీటితో మంచి టైమ్ పాస్ ఉంటుంది. 


3. జాక్ రస్సెల్ టెర్రియర్ (Jack Russell Terrier)

జాక్ రస్సెల్ టెర్రియర్స్ తెలివితేటల్లోనూ, చురుకుదనాన్ని కలిగి ఉత్సాహంగా ఉంటాయి, ఆకారంలో చిన్నగా కనిపించే ఈ అందమైన చిన్న కుక్కలు పెద్ద గొంతుతో అరుస్తాయి.


4. విమరనర్ (Weimaraner)

వీమరనర్ అందంగా ప్రత్యేకమైన ఆకర్షణతో కనిపిస్తాయి. ఈ జర్మన్ కుక్కలు వేట కోసం ప్రత్యేకంగా పెంచుతారు. ఇవి వేట సమయంలో చాలా చురుగ్గా ఉంటాయి. శారీరక ఓర్పు, బలం, సత్తువ కలిగి ఉంటాయి. ఈ జాతి కుక్కలు మంచి నేస్తాలుగా విశ్వాసంగా ఉంటాయి. 


5. ఇంగ్లీష్ స్ర్పింగర్ స్పానియల్ (English Springer Spaniel)

ఈ కుక్కలు అందమైన రూపంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇవి చాలా తెలివిగా వ్యవహరిస్తాయి, వేటలో చురుగ్గా ఉంటాయి. 


6. పెంబ్రోక్ వెల్ష్ కోర్గి (Pembroke Welsh Corgi)

ఇవి బకింగ్ హామ్ ప్యాలెస్ లో ఇంగ్లాండ్ రాణి పెంచుకున్న కుక్కలు. ఆమెకు ఈ జాతి కుక్కల మీద ఎందుకంత మమకారమంటే ఇవి చాలా చురుగ్గా ఉంటాయి. పైగా వీటికి శిక్షణ ఇవ్వడం కూడా చాలా సులభం కూడా. సహజంగా తెలివిగా మసలుకుంటాయి, ఇవి ఆకారంలో చాలా చిన్నగా ఉంటాయి. 


7. ఐరిష్ సెట్టర్ (Irish Setter)

ఐరిష్ సెట్టర్ వేటలో చురుగ్గా ఉంటుంది. ఎర్రటి కోటులా ఉండే వీటి బొచ్చు ఆకర్షణగా నిలుస్తుంది. 


8. జర్మన్ షార్ట్ హైర్ట్ పాయింటర్ (German Shorthaired Pointer)

ఇవి లక్ష్యాలను సులువుగా గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. శరీర సామర్థ్యంలో చాలా బలంగా ఉంటాయి. పరిగెత్తడం, వ్యాయామం చేయడానికి ఇష్టపడతాయి. 


9. అలాస్కాన్ హస్కీ (Alaskan Husky)

ఈ కుక్క జాతి చల్లని వాతావరణంలో, మంచు ప్రాంతాలలో కూడా పెరుగుతాయి. ఈ కుక్కుల తోడేలు మనస్తత్వాన్ని కలిగి ఉంటాయి. ఈ హస్కీలు సైబీరియన్ హస్కీ వంటి క్రాస్ బ్రీడింగ్, యూరోపియన్ హస్కీ జాతుల కంటే ఉత్తమమైనవి. 


10. అలస్కాన్ మలమూట్ ( Alaskan Malamute)

ఇవి చల్లని వాతావరణంలో పెరుగుతాయి. కానీ ఇవి స్లెడ్ లను లాగడానికి బదులుగా పెంపుడు జంతువులుగా మరింత అనుకూలంగా పెరుగుతాయి. అంతే కాకుండా ఈ కుక్కులు పిల్లలతో మచ్చికగా ఉంటాయి. అలాస్కాన్ హస్కీ, సైబీరియన హస్కీ, అలాస్కాన్ మలామూట్ ఒకే జాతికి చెందినట్టుగా జన్యు ఆకృతిలో పోలికలతో ఉంటాయి. చాలా వరకూ వీటి మధ్య దగ్గరి పోలికలు కనిపిస్తాయి. 

Updated Date - 2022-10-07T16:33:36+05:30 IST