-
-
Home » Prathyekam » The youths who entered the girls house during the day committed atrocities and finally poured petrol and set it on fire kjr spl-MRGS-Prathyekam
-
వంట చేస్తున్న బాలిక వద్దకు.. పట్టపగలు పెట్రోల్ తీసుకుని వెళ్లిన యువకులు.. కాసేపటి తర్వాత స్థానికులు వెళ్లి చూస్తే..
ABN , First Publish Date - 2022-09-11T22:27:42+05:30 IST
బాలికలు, యువకులు, మహిళలు అనే తేడా లేకుండా పట్టపగలే కొందరు దారుణాలకు పాల్పడుతున్నారు. ప్రేమ పేరుతో కొందరు దారుణాలకు తెగబడుతుంటే, మరికొందరు పెళ్లి పేరుతో...

బాలికలు, యువకులు, మహిళలు అనే తేడా లేకుండా పట్టపగలే కొందరు దారుణాలకు పాల్పడుతున్నారు. ప్రేమ పేరుతో కొందరు దారుణాలకు తెగబడుతుంటే, మరికొందరు పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ఇంకొందరైతే.. అవతలి వారికి ఇష్టం లేకున్నా తమనే ప్రేమించాలంటూ బెదిరించడం, వినకపోతే అఘాయిత్యానికి పాల్పడడం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఓ బాలిక విషయంలో దారుణం జరిగింది. మధ్యాహ్న సమయంలో వంట చేస్తున్న బాలిక వద్దకు వెళ్లిన ఇద్దరు యువకులు చివరకు దారుణానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) పిలిభిత్ పరిధికి చెందిన ఓ వ్యక్తి భార్య, కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నాడు. వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఇలావుండగా, సెప్టెంబర్ 7న ఇంట్లో బాలిక తల్లి మేనమామ ఇంటికి వెళ్లింది. తండ్రి పొలం పనులకు వెళ్లాడు. ఆ సమయంలో గ్రామానికి చెందిన రాజ్‌వీర్, తారాచంద్ర అనే యువకులు బాలిక ఇంట్లోకి పెట్రోల్ తీసుకుని వచ్చారు. మధ్యాహ్న సమయంలో వంట చేస్తున్న బాలిక వద్దకు వెనుక నుంచి వెళ్లి ఒక్కసారిగా నోరు మూశారు. వద్దు వద్దు అంటూ వేడుకుంటున్నా వినకుండా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం ఎవరికైనా చెబుతుందేమో అని.. పెట్రోల్ పోసి నిప్పంటించి వెళ్లారు.
బ్రేకప్ చెప్పిందని మరీ ఇంత దారుణమా..? 22 ఏళ్ల యువతి అద్దెకు ఉంటున్న గదికి అతడు వెళ్లి మరీ..

మంటలు వ్యాపించడంతో బాలిక పెద్దగా కేకలు పెట్టింది. స్థానికులు గమనించి, లోపలికి వెళ్లగా బాలిక మంటల్లో కాలిపోతూ ఉంది. వెంటనే మంటలను ఆర్పేసి, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శరీరం సుమారు 90శాతం కాలిపోవడంతో పరిస్థితి విషమంగా ఉంది. మూడు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం స్పృహలోకి వచ్చింది. బోరున విలపిస్తున్న తండ్రిని చూసి, నాన్నా అంటూ.. ఆ రోజు జరిగిన విషయాన్ని తెలియజేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులకు ఉరి శిక్ష వేయాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.