నిద్రలోంచి లేవగానే గదిలో కనిపించని అక్క.. అనుమానంతో తల్లిదండ్రులకు చెప్పిన చెల్లి.. ఇంటి వెనుక షాకింగ్ సీన్ చూసి..

ABN , First Publish Date - 2022-02-05T22:20:10+05:30 IST

ఆ యువతికి నెల రోజుల క్రితమే నిశ్చితార్థం జరిగింది. త్వరలో వివాహ కార్యక్రమం నిర్వహించేలా మాట్లాడుకున్నారు. దీంతో ఈ యువతి తన వివాహానంతరం జీవితం గురించి కలలు కంటూ రోజులు లెక్కపెట్టుకుంటూ ఉంది. ఆ ఆనందాన్ని..

నిద్రలోంచి లేవగానే గదిలో కనిపించని అక్క.. అనుమానంతో తల్లిదండ్రులకు చెప్పిన చెల్లి.. ఇంటి వెనుక షాకింగ్ సీన్ చూసి..
సుమన్ రాయ్‌గర్ (ఫైల్)

ఆ యువతికి నెల రోజుల క్రితమే నిశ్చితార్థం జరిగింది. త్వరలో వివాహ కార్యక్రమం నిర్వహించేలా మాట్లాడుకున్నారు. దీంతో ఈ యువతి తన వివాహానంతరం జీవితం గురించి కలలు కంటూ రోజులు లెక్కపెట్టుకుంటూ ఉంది. ఆ ఆనందాన్ని చెల్లితో పంచుకుంటూ పొద్దుటి నుంచి రాత్రి వరకూ సరదగా గడిపారు. రాత్రి భోజనం అనంతరం చెల్లితో పాటే పడుకుంది. అయితే తెల్లారేసరికి చూస్తే చెల్లి మాత్రమే ఉంది. గదిలో అక్క కనిపించకపోవడంతో చెల్లికి అనుమానం వచ్చి తల్లిదండ్రులకు చెప్పింది. తర్వాత జరిగన ఘటన స్థానికులందరినీ షాక్‌కు గురి చేసింది. వివరాల్లోకి వెళితే...


రాజస్థాన్‌లోని సికర్ జిల్లా సుజన్‌పూర్‌ గ్రామంలో హనుమంతరామ్‌ రాయగర్‌ కుటుంబం నివాసం ఉంటోంది. వీరికి సుమన్ రాయ్‌గర్(22) అనే కుమార్తె ఉంది. ఈమెకు నెల క్రితమే నిశ్చితార్థం జరిగింది. అందరు ఆడపిల్లల మాదిరే ఈ యువతి కూడా వివాహానంతరం తన జీవితం గురించి ఊహించుకుంటూ ఆనందంగా గడిపేది. రోజూ చెల్లెలితో తన ఆనందాన్ని పంచుకుంటూ ఉండేది. రోజూ మాదిరే గత మంగళవారం కూడా రోజంతా చెల్లెలితో సరదాగా గడిపి.. రాత్రి భోజనం అనంతరం చెల్లెలితో పాటూ పడుకుంది.

భార్య పరాయి మగవారితో ఉండగా చూడటమే అతడి వ్యసనం.. అందుకోసం చివరికి ఏం చేశాడో తెలుసా..


అయితే ఉదయం లేచి చూసే సరికి గదిలో అక్క కనిపించలేదు. దీంతో చెల్లెలికి అనుమానం వచ్చి.. ఇంట్లో తల్లిదండ్రులకు విషయం చెప్పింది. ఇల్లంతా వెతికినా కనిపించకపోవడంతో, బయటికి వెళ్లుంటుందిలే అనుకుని మొదట అనుకున్నారు. కానీ ఎంతసేపటికీ రాకపోవడంతో ఇంటి పరిసరాల్లో వెతకడానికి వెళ్లారు. వారి ఇంటికి కాస్త దూరంలో రక్తపు మడుగులో కూతురు మృతదేహం పడి ఉండడంతో అంతా షాక్ అయ్యారు.

భార్య ప్రేమతో అడిగిందని బైక్‌లో బయటికి తీసుకెళ్లాడు.. ఉన్నట్టుండి మధ్యలో బండికి పంక్చర్.. అంతలోనే..


కూతురు మృతదేహం మీద పడి బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పదునైన ఆయుధంతో హత్య చేసినట్లు గుర్తించారు. నిశ్చితార్థం జరిగిన నెల రోజుల్లోనే హత్య జరగడంతో ప్రేమ వ్యవహారమే కారణం కావొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. యువతి హత్యతో స్థానికంగా విషాధ చాయలు అలుముకున్నాయి.

భార్యాభర్తలిద్దరూ పార్టీ చేసుకున్నారు.. ముక్కలు కూడా సిద్ధం చేసుకున్నారు.. మందు తాగుతూ చివరగా భార్యతో ఇలా అన్నాడు..

Read more