ఇంటికి రండి పెళ్లి చేస్తామన్న యువతి తల్లిదండ్రులు.. అయితే సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసిన కూతురు.. ఏమంటోందంటే..

ABN , First Publish Date - 2022-05-23T01:17:26+05:30 IST

ప్రేమ వ్యవహారాల్లో సినిమా తరహా ట్వి్స్టులు చోటు చేసుకుంటుంటాయి. కులం, ఆర్థిక వ్యవహారాలు తదితర కారణాలతో చాలా మంది తల్లిదండ్రులు ప్రేమ వివాహాలకు అభ్యంతరం చెబుతుంటారు. అయినా కొందరు...

ఇంటికి రండి పెళ్లి చేస్తామన్న యువతి తల్లిదండ్రులు.. అయితే సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసిన కూతురు.. ఏమంటోందంటే..

ప్రేమ వ్యవహారాల్లో సినిమా తరహా ట్వి్స్టులు చోటు చేసుకుంటుంటాయి. కులం, ఆర్థిక వ్యవహారాలు తదితర కారణాలతో చాలా మంది తల్లిదండ్రులు ప్రేమ వివాహాలకు అభ్యంతరం చెబుతుంటారు. అయినా కొందరు ప్రేమికులు అవేవీ పట్టించుకోకుండా.. పారిపోయి పెళ్లి చేసుకుంటుంటారు. బీహార్‌లో ఓ ప్రేమజంట కూడా ఇలాగే చేసింది. అయితే తల్లిదండ్రులు మాత్రం... ఇంటికి రండి మళ్లీ ఘనంగా పెళ్లి చేస్తామంటూ నచ్చజెప్పారు. యువతి మాత్రం అందుకు ఒప్పుకోకుండా భర్తతో కలిసి వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


బీహార్ రాష్ట్రం మధుబని జిల్లా హర్లాఖి ప్రాంతానికి చెందిన యువకుడు, సీతామర్హి ప్రాంతానికి చెందిన యువతి.. చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమ విషయాన్ని యువతి.. తన తల్లిదండ్రులకు తెలియజేసింది. అయితే వారు మాత్రం అందుకు అభ్యంతరం తెలిపారు. అయినా ఆ ప్రేమికులు మాత్రం ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులకు తెలీకుండా..  మే21న మధుబనిలోని హర్లాఖిలోని ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు.

కవలలు కావడంతో భర్తను గుర్తుపట్టలేకపోయిన భార్య.. దీన్నే అవకాశంగా తీసుకున్న అన్న.. తమ్ముడు లేని సమయంలో..


విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు.. కూతురికి ఫోన్ చేసి, ‘‘ ఇంటికి రండి మీకు మళ్లీ ఘనంగా పెళ్లి చేస్తాం’’.. అంటూ నచ్చజెప్పారు. అయితే యువతి మాత్రం అందుకు ఒప్పుకోలేదు. వెంటనే తన భర్తతో కలిసి వీడియో తీసింది. ‘‘ మమ్మల్ని ఇంటికి పిలిచి చంపేయాలని కుటుంబ సభ్యులు కుట్ర పన్నుతున్నారని, మాకు ఏమైనా జరిగితే అందుకు నా మేనమామ, తల్లిదండ్రులే కారణం’’ అని ఆరోపిస్తూ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తమకు భద్రత కల్పించాలంటూ వేడుకుంటున్నారు. దీనిపై పోలీసులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.

తనను దూరం పెడుతోందనే కారణంతో ప్రేయసిని గోవా తీసుకెళ్లాడు.. బీచ్‌లో ఇద్దరి మధ్య వాగ్వాదం.. మరుసటి రోజు చూస్తే..

Updated Date - 2022-05-23T01:17:26+05:30 IST