ప్రేమలో పడిన వారికి కుక్క కంటే హీనమైన చావు తప్పదంటూ వాట్సప్ స్టేటస్‌లు పెట్టి మరీ 27 ఏళ్ల యువతి దారుణమిది..!

ABN , First Publish Date - 2022-06-24T00:41:52+05:30 IST

కొందరు యువకులు ప్రేమ పేరుతో యువతులకు దగ్గరై.. జీవితాంతం అదే ప్రేమను చూపిస్తుంటారు. మరికొందరు యువకులు అదే ప్రేమ పేరుతో నమ్మించి.. చివరకు దారుణంగా...

ప్రేమలో పడిన వారికి కుక్క కంటే హీనమైన చావు తప్పదంటూ వాట్సప్ స్టేటస్‌లు పెట్టి మరీ 27 ఏళ్ల యువతి దారుణమిది..!

కొందరు యువకులు ప్రేమ పేరుతో యువతులకు దగ్గరై.. జీవితాంతం అదే ప్రేమను చూపిస్తుంటారు. మరికొందరు యువకులు అదే ప్రేమ పేరుతో నమ్మించి.. చివరకు దారుణంగా మోసం చేస్తుంటారు. రాజస్థాన్‌లో ఓ యువతికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ప్రేమించిన వాడు మోసం చేసే సరికి.. చివరకు ఆమెకు జీవితంపైనే విరక్తి పుట్టింది. ప్రేమలో పడిన వారికి కుక్క కంటే హీనమైన చావు తప్పదంటూ వాట్సప్  స్టేటస్‌లు పెట్టి.. ఆమె చేసిన పని స్థానికంగా సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్ రాష్ట్రం బన్స్వార పరిధి దుంగార్‌పూర్‌లోని ఝోంత్రి తహసీల్‌ సమీపంలోని గోరాడ గ్రామంలో నివాసం ఉంటున్న టీనా హిరత్(27)కు.. చందర్‌వాడలో పనిచేస్తున్న పట్వారీ మనోజ్ ఖరాడి అనే యువకుడితో మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చడంతో అప్పటి నుంచి ఇద్దరూ లవ్ ఇన్ లేషన్‌షిప్‌లో ఉన్నారు. ఛజా అనే గ్రామంలో ఇల్లు తీసుకుని జీవనం సాగించేవారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ నెలన్నర క్రితం ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో అప్పటి నుంచి మనోజ్.. టీనాను వదిలేసి దూరంగా ఉంటున్నాడు.

గాజులు కొనుక్కుంటానంటే పెళ్లయిన ఏడో రోజే మార్కెట్‌కు తీసుకెళ్లిన భర్త.. నడిరోడ్డుపై ఊహించని షాకిచ్చిన భార్య..!


కటారో చెరువు గ్రామంలో మనోజ్ ఉన్నాడని తెలుసుకున్న టీనా... బుధవారం అక్కడికి వెళ్లింది. అయితే ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతడి నుంచి స్పందన రాలేదు. దీంతో చివరకు జీవితంపైనే విరక్తి చెంది రాత్రి 9గంటల సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు గమనించి.. అక్కడికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రెండు మొబైల్స్‌, కాలిపోయిన బాటిల్‌ అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆమె మొబైల్‌లో మెసేజ్‌లు, స్టేటస్‌లను గుర్తించారు. అందులో.. ‘‘దయచేసి ఎవరూ ప్రేమించకండి.. ప్రేమలో పడిన వారికి చివరకు కుక్క కంటే హీనమైన చావు తప్పదు’’ అని రాసి ఉంది.

ఉన్నట్టుండి చనిపోయిన మహిళ.. ఇంట్లో ఉన్న 20 పెంపుడు పిల్లులకు భోజనం పెట్టే వారే లేక ఆమె మృతదేహాన్నే..


అలాగే ‘‘మనోజ్ నా జీవితంతో ఆడుకున్నాడు. నాకు మోసం జరిగింది. అతడు మంచి వాడు అయ్యుంటే.. నాకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చుండేది కాదు’’ అని.. ఇలా దాదాపు 10కి పైగా స్టేటస్‌లను షేర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. మద్యం మానేయాలనే విషయంలో టీనా, మనోజ్ మధ్య గొడవ జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మరోవైపు తన కుమార్తెను మనోజే హత్య చేశాడంటూ టీనా తండ్రి శివలాల్ ఆరోపిస్తున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న మనోజ్ కోసం గాలిస్తున్నారు.

36 రోజుల క్రితం పెళ్లి.. సిటీలో కొత్త కాపురం.. భార్యను ఇంట్లోనే ఉంచి సొంతూరికి వచ్చి భర్త ఆత్మహత్య.. అసలు ట్విస్ట్ ఏంటంటే..

Updated Date - 2022-06-24T00:41:52+05:30 IST