ఇంటి బయట కూర్చున్న ఇద్దరు కూతుళ్లను బైక్‌లపై వచ్చి ఎత్తుకెళ్లిన యువకులు.. గ్రామస్తులతో కలిసి ఆ తల్లి వెతుక్కుంటూ పొలాల్లోకి వెళ్తే..

ABN , First Publish Date - 2022-09-15T23:12:18+05:30 IST

మహిళలపై దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తమ ప్రేమను కాదన్నవారిపై కక్ష పెంచుకుంటున్నారు. ఎలాగైనా తమ దారికి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో చివరకు దారుణాలకు..

ఇంటి బయట కూర్చున్న ఇద్దరు కూతుళ్లను బైక్‌లపై వచ్చి ఎత్తుకెళ్లిన యువకులు.. గ్రామస్తులతో కలిసి ఆ తల్లి వెతుక్కుంటూ పొలాల్లోకి వెళ్తే..

మహిళలపై దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తమ ప్రేమను కాదన్నవారిపై కక్ష పెంచుకుంటున్నారు. ఎలాగైనా తమ దారికి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో చివరకు దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. పట్టపగలు ఇంటి బయట కూర్చున్న బాలికలను కొందరు యువకులు.. బైకులపై వచ్చి, బలవంతంగా ఎత్తుకెళ్లారు. తల్లితో పాటూ గ్రామస్తులంతా కలిసి వెతుక్కుంటూ పొలాల్లోకి వెళ్లారు. చివరకు అక్కడి దృశ్యం చూసి షాక్ అయ్యారు. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 


ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లఖింపూర్‌లో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి అక్కాచెల్లెళ్లు.. ఒకరు 7వ తరగతి చదువుతుండగా, మరొకరు 10వ తరగతి చదువుతున్నారు. కాగా, చోటూ అనే యువకుడు ఇటీవల వీరిని సుహైల్, హఫీజుర్ రెహమాన్, జునైద్‌లకు పరిచయం చేశాడు. అప్పటి నుంచి ముగ్గురు యువకులు.. అక్కాచెల్లెళ్లపై కన్నేశారు. ఎలాగైనా వారిని పాడు చేయాలని కుట్ర పన్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం బాలికలిద్దరూ ఇంటి బయట కూర్చుని ఉన్నారు. అదే సమయంలో రెండు బైకులపై అక్కడికి వచ్చిన యువకులు.. వారిని బలవంతంగా ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఆ సమయంలో అక్కడే ఉన్న బాలికల తల్లి.. వారిని అడ్డుకోబోయింది. అయితే నిందితులు ఆమెను కాలితో తన్ని.. బాలికలను తీసుకుని అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయారు. స్థానికులు వారిని వెంబడించినా ఫలితం లేకపోయింది.

రెండోసారీ కూతురే పుట్టినా ఆ భార్యాభర్తల్లో సంతోషం.. కానీ వారసుడు పుట్టలేదన్న కోపంతో తాత ఎంతపనిచేశాడంటే..


తర్వాత అంతా కలిసి వారిని వెతుకుతూ వెళ్లారు. బాలికలను గ్రామానికి సమీపంలోని చెరుకు తోటలోకి తీసుకెళ్లారు. అక్కడ వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారిని గొంతు నులిమి చంపేశారు. తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు వారిని చెట్టుకు ఉరి వేశారు. గ్రామస్తులు వెతుక్కుంటూ వెళ్లగా బాలికలిద్దరూ ఉరికి వేలాడుతూ కనిపించారు. దీంతో మృతుల తల్లిదండ్రులు బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రాత్రికి నిందితులు సుహైల్, హఫీజుర్ రెహమాన్, జునైద్‌ పాటూ మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు.

భర్త మంచంపై ఉండగానే.. పక్కన ప్రియుడితో సరదా కబుర్లు చెబుతున్న భార్య.. చివరకు వెలుగులోకి వచ్చిన అసలు విషయం ఏంటంటే..


ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ తెలిపారు. అలాగే బాలికల హత్య బాధాకరమని, మహిళలపై ఇటీవల నేరాలు పెరిగిపోతున్నాయని, ప్రభుత్వం ఏం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. మరోవైపు బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి స్పందిస్తూ.. ఇలాంటి దారుణ ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి నేరాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

husband love: భర్త పరాయి యువతితో తిరుగుతున్నాడని తెలిసినా స్వాగతించిన భార్య.. చివరకు ఆ యువతి గురించి తెలుసుకుని అవాక్కయిన స్థానికులు..Read more