ప్రియురాలి కోసం రూ.4కోట్ల రింగ్ తీసుకున్నాడు.. ఇవ్వడానికి కాస్త ముందే ఆమె గురించి తెలిసి.. హమ్మయ్య అనుకున్నాడు..

ABN , First Publish Date - 2022-01-20T21:49:14+05:30 IST

బ్రిటన్‌లో ఓ యువకుడు తన ప్రియురాలికి తమ ప్రేమకి గుర్తుగా రూ.4కోట్ల విలువైన రింగ్ తీసుకున్నాడు. ఉంగరాన్ని ఆమెకు అందించి సర్‌‌ఫ్రైజ్ చేయాలనుకున్నాడు. అయితే బహుమతి ఇవ్వడానికి కొన్ని గంటల ముందు ఆమె గురించి తెలిసి..

ప్రియురాలి కోసం రూ.4కోట్ల రింగ్ తీసుకున్నాడు.. ఇవ్వడానికి కాస్త ముందే ఆమె గురించి తెలిసి.. హమ్మయ్య అనుకున్నాడు..
ప్రతీకాత్మక చిత్రం

ప్రియురాలు అడగాలే గానీ ఏం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటారు. కొందరు యువతులు ఏమీ ఆశించకుండా ప్రేమిస్తుంటే.. ఇంకొందరు చిన్న చిన్న బహుమతులు అడుగుతుంటారు. అలాగే కొన్ని ప్రేమకథల్లో యువతులను యువకులు మోసం చేస్తుంటే.. ఇంకొన్ని ప్రేమకథల్లో యువకులను యువతులు మోసం చేస్తూ ఉంటారు. బ్రిటన్‌లో ఓ యువకుడు తన ప్రియురాలికి తమ ప్రేమకి గుర్తుగా రూ.4కోట్ల విలువైన రింగ్ తీసుకున్నాడు. ఉంగరాన్ని ఆమెకు అందించి సర్‌‌ఫ్రైజ్ చేయాలనుకున్నాడు. అయితే బహుమతి ఇవ్వడానికి కొన్ని గంటల ముందు ఆమె గురించి తెలిసి షాక్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే..


బ్రిటన్‌కు చెందిన మేఫెయిర్(25) అనే వ్యక్తి తన స్నేహితురాలితో కొన్ని నెలలుగా ప్రేమలో ఉన్నాడు. ఆమె అంటే అతడికి చాలా ఇష్టం. ఆమెతో మాట్లాడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేనంతగా ప్రేమ పెంచుకున్నాడు. ఆమె కూడా ఇతడిపై ఎంతో ప్రేమ చూపించేది. ఈ క్రమంలో అడిగినప్పుడల్లా ఆమెకు ఖరీదైన బహుమతులు కొనిచ్చేవాడు. తమ ప్రేమకు గుర్తుగా మరింత ఖరీదైన గిఫ్ట్ అందించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఏకంగా రూ.4కోట్లు ఖర్చు చేసి ఫ్లాటినమ్ రింగ్‌ను కోనుగోలు చేశాడు. సర్‌ఫ్రైజ్ చేయాలనే ఉద్దేశంతో ఆమెకు ఈ విషయం చెప్పకుండా దాచిపెట్టాడు. మరుసటి రోజు పొద్దునే ఉంగరాన్ని ఆమెకు ఇవ్వాలనుకునే క్రమంలో అతడికి షాకింగ్ నిజాలు తెలిశాయి.

సెల్ఫీలను అమ్ముతూ రూ.కోట్లు సంపాదిస్తున్న యువకుడు.. ఎలాగో తెలుసుకుంటే అవాక్కవుతారు..


ఉంగరాన్ని అందించి ఏవిధంగా సర్‌ఫ్రైజ్ చేయాలనే విషయంలో రాత్రంతా ఆలోచించసాగాడు. ఈ సమయంలో తన ప్రియురాలి ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌ను తనిఖీ చేశాడు. అందులో ఆమె పెట్టిన పోస్టు చూసి షాక్ అయ్యాడు. ఆమె ఇంకో యువకుడితో చాటింగ్ చేయడాన్ని గమనించాడు. తనతో ప్రేమ నటిస్తూనే ఇంకో వ్యక్తితో ప్రేమలో ఉండడాన్ని చూసి మేఫెయిర్‌ తట్టుకోలేకపోయాడు. ఆమెతో రిలేషన్ కొనసాగించకూడదని నిర్ణయించుకున్నాడు. ఆమెను పల్లెత్తుమాట కూడా అనకుండా అప్పటి నుంచి పట్టించుకోవడం మానేశాడు. అయితే ఇన్నాళ్లు తనతో గిఫ్ట్‌ల పేరుతో ఖర్చు చేసిన విషయాన్ని తన సన్నిహితులతో పంచుకున్నాడు. తెల్లారుంటే రూ.4కోట్ల రింగ్ ఇవ్వాల్సి వచ్చేదని, ముందే ఆమె గురించి తెలియడంతో డబ్బులు సేవ్ అయ్యాయని.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నాడు.

పెళ్లయిన కొన్ని నెలలకే భర్త ప్రవర్తనలో మార్పు.. చివరికి విషయం తెలుసుకుని భార్య ఏం చేసిందంటే..

Updated Date - 2022-01-20T21:49:14+05:30 IST