భర్త వేరే ఇంటికి వెళ్లడాన్ని గమనించిన భార్య.. ఓ రోజు స్కూల్‌కి వెళ్లి రిజిస్టర్‌లో చూడగా.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..

ABN , First Publish Date - 2022-01-07T02:15:00+05:30 IST

భార్య, పిల్లలు ఉన్న ఆ భర్తకు కలగరాని ఆలోచనలు కలిగాయి. ఎవరు కనిపెట్టలేరులే.. అనుకున్నాడో ఏమోగానీ.. భార్యకు తెలీకుండా పెద్ద సాహసమే చేశాడు. ఎనిమిదేళ్ల పాప ఉందని కూడా మరచిపోయి.. అతను చేసిన పని చివరకు..

భర్త వేరే ఇంటికి వెళ్లడాన్ని గమనించిన భార్య.. ఓ రోజు స్కూల్‌కి వెళ్లి రిజిస్టర్‌లో చూడగా.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ప్రతీకాత్మక చిత్రం

భార్య, పిల్లలు ఉన్న ఆ భర్తకు కలగరాని ఆలోచనలు కలిగాయి. ఎవరు కనిపెట్టలేరులే.. అనుకున్నాడో ఏమోగానీ.. భార్యకు తెలీకుండా పెద్ద సాహసమే చేశాడు. ఎనిమిదేళ్ల పాప ఉందని కూడా మరచిపోయి.. అతను చేసిన పని చివరకు సమస్యలు తెచ్చిపెట్టింది. భార్యకు తెలీకుండా రోజూ బయటికి వెళ్లేవాడు. ఓ రోజు ఆమెకు అనుమానం వచ్చి వెనుకే వెళ్లగా.. వేరే ఇంట్లోకి వెళ్లడం కనిపించింది. అనంతరం స్కూల్‌కి వెళ్లి రిజిస్టర్ చూసి షాక్ అయింది. హర్యానాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..


హర్యానా సోనిపట్ జిల్లాలోని ముర్తాల్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన రవీంద్రకు భార్య, ఎనిమిదేళ్ల కుమార్తె ఉన్నారు. 2004లో వీరికి వివాహమైంది. ఇంతవరకూ వీరి ఇంట్లో ఎలాంటి సమస్యలూ లేవు. సవ్యంగా సాగుతున్న సంసారంలో అనుకోని ఘటనలను వెలుగులోకి వచ్చాయి. పట్టణంలోని మరో మహిళతో రవీంద్ర.. వివాహేతర సంబంధం కొనసాగించాడు. అంతటితో ఆగకుండా వేరే ఇల్లు తీసుకుని.. కాపురం కూడా పెట్టేశాడు. రోజూ ఏదో ఒక సమయంలో అక్కడికి వెళ్తూ.. అనుమానం రాకుండా జాగ్రత్త పడేవాడు. అయితే ఇటీవల భర్త ప్రవర్తనలో మార్పు గమనించిన ఆమె.. ఓ రోవు వెనుకే వెళ్లింది. భర్త మరో ఇంట్లోకి వెళ్లడం చూడగానే ఆమెకు అనుమానం కలిగింది.

చాలా ఏళ్లుగా యువతిపై వన్‌సైడ్ లవ్.. కాబోయే భర్తతో ప్రియురాలు ఫోన్‌లో మాట్లాడుతుండడం చూసి.. వెనుకే వెళ్లి..


తర్వాత ఆరా తీయగా.. రెండో భార్యకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిసింది. ఈ విషయాన్ని ధ్రువీకరించుకునేందుకు పాఠశాలకు వెళ్లింది. రిజిస్టర్‌లో  ఇద్దరు పిల్లలకు తండ్రిగా తన భర్త పేరును చూసి షాక్ అయింది. ఇంటికి వచ్చిన ఆమె.. భర్తను నిలదీసింది. ఎన్నాళ్ల నుంచి జరుగుతుంది.. ఈ బాగోతం అంటూ.. ఆగ్రహం వ్యక్తం చేసింది. భార్యకు తెలియడంతో బ్లాక్‌మెయిల్ చేయడం మొదలెట్టాడు. విషయం బయట చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. జరిగిన విషయం మొత్తం పోలీసులకు తెలియజేయడంతో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది.

పెళ్లయి 11ఏళ్లవుతున్నా పుట్టింటి నుంచి రానంటున్న భార్య.. భర్త వెళ్లి రమ్మని పిలవగా షాకింగ్ సమాధానం.. చివరకు..

Updated Date - 2022-01-07T02:15:00+05:30 IST