Anantha Babu: హవ్వ.. ఎమ్మెల్సీ అనంత బాబుకు ఇలాంటి స్వాగతమా?.. ఇప్పుడిదే హాట్‌టాపిక్!
ABN , First Publish Date - 2022-12-16T22:14:27+05:30 IST
నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అన్నట్టుగా ఉంది వైఎస్సార్సీపీ ఎంఎల్సీ అనంత బాబు (YSRCP MLC Anantha Babu) తీరు. దళిత వర్గానికి చెందిన తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య, డెడ్‌బాడీ ‘డోర్ డెలివరీ’ కేసులో నిందితుడిగా ఉన్న ఆయన జైలు నుంచి విడుదలైన విధానం ముక్కున వేలేసుకునేలా ఉంది.
‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అన్నట్టుగా ఉంది వైఎస్సార్సీపీ ఎంఎల్సీ అనంత బాబు (YSRCP MLC Anantha Babu) తీరు. దళిత వర్గానికి చెందిన తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య, డెడ్‌బాడీ ‘డోర్ డెలివరీ’ కేసులో నిందితుడిగా ఉన్న ఆయన జైలు నుంచి విడుదలైన విధానం ముక్కున వేలేసుకునేలా ఉంది. సుబ్రహ్మణ్యాన్ని కారుతో ఢీకొట్టి హత్య చేశాడని, ఆ తర్వాత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే నాటకమాడాడనే టెక్నికల్, ఫోరెన్సిక్ ఆధారాలు ఉన్నాయి. దాదాపు ఏడు నెలల జైలు జీవితం కూడా గడిపాడు. అయినప్పటికీ ఏదో ఘనకార్యం చేసి జైలుకెళ్లొచ్చిన వ్యక్తిలా అనుచరులు ఆయనకు భారీ స్వాగతం పలికారు. రాజమండ్రి సెంట్రల్ జైలు వెలుపల అప్పటికే పూలమాలలు, బొకేలతో వేచిచూస్తున్న అనుచరులు ఒకింత అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ‘జై బాబు.. జైజై బాబు’ అంటూ నినాదాలు చేశారు. మెడలో దండలు వేసేందుకు పోటీపడ్డారు. అక్కడున్నవారందరికీ అనంతబాబు అభివాదం చేశారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లిపోయారు. స్వాగతం పలికిన వారిలో పలువురు మహిళలు కూడా కనిపించారు. ఈ ర్యాలీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ పరిణామం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.
ఒక దళిత వ్యక్తి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి హీరోలా స్వాగతం పలకడం శోచనీయమని ట్విటర్లో ఓ వ్యక్తి వ్యాఖ్యానించాడు. ‘మనుషుల కంటే జంతువులే నయం’ అంటూ మరో వ్యక్తి విచారం వ్యక్తం చేశాడు. ‘‘ఆయన ఏమన్నా గొప్పపని చేసి జైలుకు వెళ్లాడా?’ అని ఇంకో నెటిజన్ ప్రశ్నించాడు. ‘ ప్రజా సమస్యల కోసం ఏమైనా పోరాడాడా’ అని మరో వ్యక్తి నిలదీశాడు. ‘సిగ్గు.. సిగ్గు..’’ అంటూ మరికొందరు.. ఒక వ్యక్తిని హత్య చేశాడని తెలిసి కూడా జైకొడుతున్నవారిని ఏమనాలని కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో షరతులతో కూడిన బెయిల్‌తో దాదాపు ఏడు నెలల తర్వాత అనంత బాబు జైలు నుంచి విడుదలయ్యాడు. హత్య ఘటన సమయంలో అనంతబాబు రాజకీయ భవిష్యత్ దాదాపు ముగిసిపోయినట్టేనని చర్చలు జరిగాయి. కానీ ఇప్పుడు స్వాగతం పలికిన తీరు చూసినవారిని విస్మయానికి గురిచేస్తోంది. కాగా ఇలాంటి పోకడలు సమాజాన్ని కలవరానికి గురిచేయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.