Viral Video: సంతోషంగా గిఫ్ట్ బాక్సును తెరచిన యువతి.. చివరకు ఊహించని ఘటనతో దిమ్మతిరిగే షాక్..

ABN , First Publish Date - 2022-09-09T00:55:17+05:30 IST

స్నేహితులను ఆట పట్టించే క్రమంలో కొందరు చిత్రవిచిత్రమైన ఐడియాలతో ప్రాంక్ చేస్తుంటారు. పుట్టిన రోజులు, వివాహ కార్యక్రమాల్లో వధూవరులను వారి స్నేహితులు ఇలాగే ఆట పట్టిస్తుంటారు...

Viral Video: సంతోషంగా గిఫ్ట్ బాక్సును తెరచిన యువతి.. చివరకు ఊహించని ఘటనతో దిమ్మతిరిగే షాక్..

స్నేహితులను ఆట పట్టించే క్రమంలో కొందరు చిత్రవిచిత్రమైన ఐడియాలతో ప్రాంక్ చేస్తుంటారు. పుట్టిన రోజులు, వివాహ కార్యక్రమాల్లో వధూవరులను వారి స్నేహితులు ఇలాగే ఆట పట్టిస్తుంటారు. కొందరు గిఫ్ట్ బాక్సుల్లో వింత వింత వస్తువులను పెట్టి అందిస్తుంటారు. చివరకు బాక్సులను తెరచేవారు అవాక్కవడం చూస్తూనే ఉంటాం. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో (Viral videos) కూడా ఇలాంటిదే. ఓ యువతి తన బర్త్ డే సందర్భంగా వచ్చిన గిఫ్టులను తెరచి చూస్తూ ఉంటుంది. ఈ క్రమంలో చివరకు ఓ బాక్సును ఓపెన్ చేసి ఖంగుతింటుంది. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.


ఇన్‌స్టాగ్రాంలో (Instagram) ఓ వీడియో వైరల్ అవుతోంది. పుట్టిన రోజు సందర్భంగా ఓ యువతి తనకు వచ్చిన గిఫ్టులన్నింటినీ ఆత్రుతగా తెరచి చూస్తుంటుంది. ఈ క్రమంలో ఓ ఎర్రటి బాక్సును తెరిచేందుకు ప్రయత్నిస్తుంది. తీరా ఓపెన్ చేయగానే.. అందులోంచి ఓ ప్లాస్టిక్ బల్లి (Plastic lizard) ఎగిరి బయటకు వస్తుంది. ఊహించని ఈ ఘటనతో యువతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మీద పడిన బల్లిని పక్కకు నెట్టేసే క్రమంలో కుర్చీ నుంచి కిందపడిపోతుంది. యువతి తల్లి కూడా పక్కనే ఉంటుంది. ఈ ఘటనతో ఆమె కూడా వామ్మో.. అంటూ భయపడిపోతుంది. చివరకు ప్రాంక్ అని తెలిసి అంతా తెగ నవ్వుకుంటారు. ఈ ఘటనను అక్కడే ఉన్న స్నేహితులు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. 

పదే పదే అదే మాట అంటుండడంతో ఆగ్రహించిన కోడలు.. అత్త వేళ్లను కొరికేయడమే కాకుండా భర్త అని కూడా చూడకుండా..





Updated Date - 2022-09-09T00:55:17+05:30 IST

Read more