Wedding funny video: కాబోయే భార్య కోసం సాహసం చేసిన వరుడు.. వీడియో చూసి శభాష్ అంటున్న నెటిజన్లు..
ABN , First Publish Date - 2022-08-17T01:39:57+05:30 IST
చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా? చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలవా?.. అని ప్రేయసి అంటే.. చెట్టులెక్కగలనే! ఓ చెంచిత పుట్టలెక్కగలనే! చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మల..

చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా? చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలవా?.. అని ప్రేయసి అంటే.. చెట్టులెక్కగలనే! ఓ చెంచిత పుట్టలెక్కగలనే! చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలనే! అని ప్రియుడు పాట పాడటం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఓ వరుడు.. ఒకడుగు ముందుకేసి, చెట్టులెక్కడంతో పాటూ పొంగి పొర్లుతున్న వరదను కూడా దాటగలను.. అని నిరూపించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ (Viral videos) అవుతోంది.
ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు (Heavy rains) కురుస్తుండడంతో వరదలు పోటెత్తుతున్నాయి. ఈ క్రమంలో అనుకోని ప్రమాదాలు కూడా జరగడం చూస్తూనే ఉన్నాం. అందుకే వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు పదే పదే హెచ్చరిస్తుంటారు. ఇదిలావుండగా, సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో వైరల్ అవుతోంది. వరద ప్రభావిత ప్రాంతానికి చెందిన వరుడు.. వివాహ దుస్తుల్లో కాబోయే భార్య వద్దకు వెళ్లేందుకు పెద్ద సాహసమే చేశాడు. బంధువులతో పాటూ వధువు ఇంటికి బయలుదేరే క్రమంలో వరద అడ్డుగా వస్తుంది. అయినా లెక్కచేయకుండా దాటేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అతడు కొంచెం తడబడుతుండగా.. పక్కన ఉన్న మరో వ్యక్తి అతడికి సాయం చేస్తాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు (Netizens) ఫన్నీ ఫన్నీగా కామెంట్లు (Funny comments) పెడుతున్నారు.