-
-
Home » Prathyekam » The video of the bull entering the shops and destroying the goods is going viral on social media kjr spl-MRGS-Prathyekam
-
Viral Video: ఎద్దుకు కోపం వస్తే ఇలాగే ఉంటుందేమో.. వామ్మో! చివరకు రచ్చ రచ్చ చేసిందిగా..
ABN , First Publish Date - 2022-08-21T00:33:30+05:30 IST
పెద్ద పెద్ద జంతువులకు (animals) కోపం వచ్చిన సందర్భాల్లో ఎంత బీభత్సం సృష్టిస్తుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అటవీ ప్రాంత గ్రామాల్లోకి చొరబడే ఏనుగులు.. పంటలను..

పెద్ద పెద్ద జంతువులకు (animals) కోపం వచ్చిన సందర్భాల్లో ఎంత బీభత్సం సృష్టిస్తుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అటవీ ప్రాంత గ్రామాల్లోకి చొరబడే ఏనుగులు.. పంటలను నాశనం చేయడమే కాకుండా మనుషులపై కూడా దాడులు చేయడం తరచూ చూస్తుంటాం. ఇందుకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. అయితే ప్రస్తుతం ఓ ఎద్దుకు విపరీతమైన కోపం వచ్చింది. దీంతో చివరకు రచ్చ రచ్చ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో (Social media) తెగ చక్కర్లు కొడుతోంది.
పెరూ (Peru) దేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. లిమా అనే ప్రాంతంలోని రోడ్డు పక్క దుకాణాల వద్దకు ఓ ఎద్దు వేగంగా దూసుకొస్తుంది. దాన్ని గమనించిన వారు అక్కడి నుంచి పక్కకు తప్పుకొంటారు. వచ్చీ రాగానే ఓ టేబుల్‌ను కొమ్ములతో ఎత్తి పక్కన పడేస్తుంది. అంతటితో ఆగకుండా అక్కడున్న బోర్డులను కిందపడేసి, చివరకు ఓ షాపులోకి దూరుతుంది. అక్కడున్న కుర్చీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను (Electronic devices) చిందరవందరగా పడేస్తుంది. అప్పటికీ కోపం తగ్గని ఆ ఎద్దు.. షాపు నుంచి కోపంగా పక్కన ఉన్న దుకాణాంలోకి దూసుకెళ్లుంది. ఈ ఘటన మోత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. మొత్తానికి ఎవరికీ ఎలాంటి ప్రాణహాని లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.