ఒక్క వీడియో కోసం కోడలి ప్రాణాన్ని తీసేసిన మామ.. ఇంతకీ ఆమె సీక్రెట్‌గా తీసిన వీడియోలో ఏముందంటే..

ABN , First Publish Date - 2022-01-23T00:04:27+05:30 IST

మామకు సంబంధించిన ఒక్క వీడియోను తిరిగి ఇవ్వకపోవడంతో కొడలి ప్రాణాలకే ముప్పు వచ్చింది. ఎలాగైనా భర్త, మామ బండారం బయటపెడదామనుకున్న ఆమె.. చివరికి అనంతలోకాలకు చేరుకుంది. అత్యంత విషాధకరమైన ఈ ఘటన వివరాల్లోకి వెళితే..

ఒక్క వీడియో కోసం కోడలి ప్రాణాన్ని తీసేసిన మామ.. ఇంతకీ ఆమె సీక్రెట్‌గా తీసిన వీడియోలో ఏముందంటే..

కొన్నిసార్లు మొండితనం, పంతాలు, పట్టింపులు, పగలు, ప్రతీకారాలు.. వెరసి జీవితాలను సర్వ నాశనం చేస్తుంటాయి. ఎవరెలాపోతే మనకెందుకులే అనుకునే వాళ్లు కొందరు ఉంటారు..  అలాగే కొన్ని అక్రమాలు, అన్యాయాలను ఎదిరించేందుకు కొందరు ఎంతవరకైనా తెగిస్తుంటారు. ఇలాగే మామకు సంబంధించిన ఒక్క వీడియోను తిరిగి ఇవ్వకపోవడంతో కొడలి ప్రాణాలకే ముప్పు వచ్చింది. ఎలాగైనా భర్త, మామ బండారం బయటపెడదామనుకున్న ఆమె.. చివరికి అనంతలోకాలకు చేరుకుంది. అత్యంత విషాధకరమైన ఈ ఘటన వివరాల్లోకి వెళితే..


బీహార్ రాష్ట్రం పాట్నా నవాదా పరిధిలోని  భదౌని ఆజాద్ ప్రాంతంలో అంజుమ్‌ అనే మహిళ కుటుంబం నివాసం ఉంటోంది. ఈమె భర్త, అత్తమామలతో కలిసి ఉంటోంది. అంజుమ్ కుటుంబంలో ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకున్నా.. భర్త, మామ చేసిన నిర్వాకమే చివరకు సమస్యలు తెచ్చిపెట్టింది. భార్యలతో అన్యోన్యంగా ఉండాల్సిన భర్త, మామ.. అందుకు వ్యతిరేకంగా పరాయి మహిళలతో వివాహేతర సంబంధం కొనసాగించారు. ఈ క్రమంలో తరచూ అంజుమ్, ఆమె భర్త మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలో ఎనిమిది నెలల క్రితం అంజుమ్ భర్త.. ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. అప్పటి నుంచి అంజుమ్.. అత్తమామల వద్ద ఉంటోంది.

ఆస్పత్రిలో బయటపడిన 12 పుర్రెలు, 54 ఎముకలు.. డాక్టర్‌ను నిలదీస్తే నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి..!


ఇలావుండగా అంజుమ్ మామ వివాహేతర సంబంధాలు కొనసాగించేవాడు. ఇటీవల అంజుమ్ తన స్నేహితురాలి సాయంతో మామ పరాయి మహిళతో ఉన్న సమయంలో వీడియో తీయించింది. దీంతో అప్పటి నుంచి కోడలిపై మామ పగ పెంచుకున్నాడు. వీడియో ఇవ్వమని అడిగినా కోడలు ఇవ్వకపోవడంతో ఎలాగైనా అంతమొందించాలని అనుకున్నాడు. మామ, అత్త కలిసి కోడలు అంజుమ్‌ను చంపి, ఉరికి వేలాదదీసి.. ఆత్మహత్యగా చిత్రీకరించారు. అంజుమ్ సోదరుడు భైసూర్ మహ్మద్ ఆజాద్ ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేశారు. అంజుమ్ మామ మినహా కుటుంబ సభ్యులంతా పరారీలో ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

పెళ్లీ లేదూ గిల్లీ లేదు.. వ్యభిచారం చేయాల్సిందేనన్న తల్లిదండ్రులు.. వద్దంటున్నా బలవంతంగా.. ఆ గ్రామంలో ఎంతోమంది ఇలాగే..


Read more