మాత్రలు వాడుతున్నా ఎంతకూ తగ్గని జ్వరం.. ఆస్పత్రికి తీసుకెళ్లమని ఆ తల్లి అడిగితే కొడుకు చేసిన దారుణమిదీ..!

ABN , First Publish Date - 2022-09-14T21:03:19+05:30 IST

ఒక్క కొడుకని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. కానీ ఆ కొడుకే చివరకు తమ పాలిట కాలయముడు అవుతాడని ఆ తల్లి ఊహించలేకపోయింది. కొడుకులో జాలి, దయ లేని ఓ శాడిస్టు ఉన్నాడనే..

మాత్రలు వాడుతున్నా ఎంతకూ తగ్గని జ్వరం.. ఆస్పత్రికి తీసుకెళ్లమని ఆ తల్లి అడిగితే కొడుకు చేసిన దారుణమిదీ..!

ఒక్క కొడుకని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. కానీ ఆ కొడుకే చివరకు తమ పాలిట కాలయముడు అవుతాడని ఆ తల్లి ఊహించలేకపోయింది. కొడుకులో జాలి, దయ లేని ఓ సైకో ఉన్నాడనే విషయం వారికి ఆసల్యంగా తెలిసింది. జులాయిగా తిరుగుతూ ఏమాత్రం బాధ్యత లేకపోగా.. చివరకు తల్లిదండ్రులను కూడా ఎదిరించేవాడు. ఇటీవల అనారోగ్యంతో ఉన్న తల్లి.. ఎన్ని మాత్రలు వాడుతున్నా జ్వరం తగ్గడం లేదు. దీంతో ఆస్పత్రికి తీసుకెళ్లమని కొడుకును కోరింది. ఇదే ఆమె చేసిన తప్పయింది. చికిత్స చేయించకపోగా తల్లిపైనే దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా చివరికి దారుణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..


ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) గరియాబంద్ జిల్లా అమ్లిప్దార్ ప్రాంతంలో తాసిల్ రామ్ అనే వ్యక్తి భార్య నిషాద్(47), కొడుకు ధన్‌సింగ్, ఇద్దరు కుమార్తెలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. తాసిల్ వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొడుకు ధన్‌సింగ్ మాత్రం ఏ పనీ చేయకుండా జులాయిగా తిరుగుతుండేవాడు. కొన్ని రోజులుగా నిషాద్.. అనారోగ్యంతో (illness) బాధపడుతోంది. తరచూ మాత్రలు వాడుతున్నా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో తీవ్రమైన జ్వరంతో బుధవారం ఉదయం ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. ఆ సమయంలో భర్త తాసిల్.. వ్యవసాయ పనుల్లో ఉన్నాడు. ఇంట్లో కొడుకు ధన్‌సింగ్, కుమార్తెలు మాత్రమే ఉన్నారు. దీంతో తనను ఆస్పత్రికి తీసుకెళ్లాలని కొడుకును కోరింది. దీంతో తనను విసిగించవద్దంటూ కోపగించుకున్నాడు.

అవును.. 9 రోజుల క్రితం పుట్టిన కూతుర్ని ఎవరికీ తెలీకుండా నేనే చంపానంటూ ఆ తండ్రి చెప్పిన కారణం విని అంతా షాక్..!


పదే పదే ఆస్పత్రికి తీసుకెళ్లమని అడుగుతుండడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. దుర్భాషలాడడమే కాకుండా తల్లి అని చూడకుండా దాడికి పాల్పడ్డాడు. అడ్డొచ్చిన చెల్లెళ్లపై కూడా దాడికి పాల్పడ్డాడు. దీంతో తల్లి ఇంటి నుంచి బయటికి పరుగులు తీసింది. అయినా వదలని ధన్‌సింగ్.. ఆమెను వెంబడించాడు. ఇంటికి సమీపంలోని ఖాళీ స్థలంలో దాక్కున్న తల్లి తలపై పెద్ద రాయితో కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. దాడి అనంతరం ధన్‌సింగ్ భయంతో డీజిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

రైల్లో బెర్త్‌పై పడుకుని ఉన్న 17 ఏళ్ల అమ్మాయి.. సడన్‌గా పోలీసుల ఎంట్రీ.. మధ్యలోనే దింపేసి స్టేషన్‌కు.. అసలు కథేంటంటే..Read more