మొదటి భర్త కంటే రెండో భర్త మేలనుకుంది.. కానీ, అతను కూడా... ఆ రోజు రాత్రి ఫుల్‌గా మందు తాగొచ్చి..

ABN , First Publish Date - 2022-01-18T00:00:47+05:30 IST

మొదటి భర్తతో విభేదాలు వచ్చి విడాకులు తీసుకుంది. తర్వాత రెండో వివాహం చేసుకుంది. ఇక కష్టాలు ఉండవనుకుంటున్న క్రమంలో ఆమె జీవితంలో మళ్లీ సమస్యలు తిష్ట వేశాయి. వివరాల్లోకి వెళితే..

మొదటి భర్త కంటే రెండో భర్త మేలనుకుంది.. కానీ, అతను కూడా... ఆ రోజు రాత్రి ఫుల్‌గా మందు తాగొచ్చి..

వివిధ కారణాలతో వివాహ బంధాలు మధ్యలోనే ముగుస్తుంటాయి. ఈ క్రమంలో కొందరు దంపతులు విడాకులు తీసుకుని, ఎవరిదారిన వారు వెళ్తుంటారు. కొన్నాళ్లకు తమకు ఇష్టమైన వారిని రెండో వివాహం చేసుకుని సంసార జీవితాన్ని కొనసాగిస్తుంటారు. అయినా కొందరి జీవితంలో మాత్రం సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. తమిళనాడులో ఓ మహిళకు ఇలాగే జరిగింది. మొదటి భర్తతో విభేదాలు వచ్చి విడాకులు తీసుకుంది. తర్వాత రెండో వివాహం చేసుకుంది. ఇక కష్టాలు ఉండవనుకుంటున్న క్రమంలో ఆమె జీవితంలో మళ్లీ సమస్యలు తిష్ట వేశాయి. వివరాల్లోకి వెళితే..


తమిళనాడు కన్యాకుమారి జిల్లాలోని రాజక్కమంగళం అనే ప్రాంతానికి చెందిన సుజ(45), విజయ్‌కుమార్(45) భార్యాభర్తలు. సుజకు గతంలోనే వివాహమైంది. అయితే మొదటి భర్త తరచూ వేధించేవాడు. కొన్నాళ్లు భరించినా.. భర్త తీరులో మాత్రం మార్పు రాలేదు. దీంతో విరక్తిచెంది తనతో విడాకులు తీసుకుంది. కొన్నాళ్లు ఒంటరి జీవితం గడిపిన అనంతరం విజయ్‌కుమార్‌ను రెండో వివాహం చేసుకుంది. రెండో భర్త బాగా చూసుకోవడంతో కష్టాలు తీరిపోయాయని సంతోషపడింది. ఆమె అనుకున్నట్లుగానే వారి సంసారం కొన్నాళ్లు సాఫీగా సాగింది.

చికెన్ తెస్తానని వెళ్లి.. సాయంత్రానికి కోటీశ్వరుడయ్యాడు.. దెబ్బకు ఈ పెయింటర్ రాతే మారిపోయింది..


రెండో పెళ్లి చేసుకున్న సుజ జీవితంలో కొన్నాళ్లకు సమస్యలు మళ్లీ మొదలయ్యాయి. భర్త విజయ్‌కుమార్ అప్పుడప్పుడూ మద్యం సేవించి ఇంటికొచ్చేవాడు. ఆ సమయంలో ఏవేవో సాకులు చూపుతూ భార్యను దుర్భాషలాడేవాడు. మద్యం మత్తులో అలా ప్రవర్తిస్తున్నాడులే అనుకుని తనకు తాను సర్దిచెప్పుకొంది. అయితే విజయ్‌కుమార్ మాత్రం రోజూ మద్యం సేవించి గొడవ చేసేవాడు. గత నెల 23వ తేదీన రాత్రి యథావిధిగా ఫుల్‌గా మందు తాగొచ్చి భార్యతో గొడవపడ్డాడు. భార్య ఎదురు చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయి, ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాడు. తీవ్రగాయాలపాలైన ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే సుజ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

మాజీ ప్రియుడిపై పోలీసులకు యువతి ఫిర్యాదు.. అనుమానం వచ్చి విచారించగా.. బయటపడ్డ ‘ప్రేయసి’ బండారం!

Read more