ఇంట్లోకి దొంగ దూరాడంటూ పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు.. గదిలో షాకింగ్ దృశ్యం.. అసలు కథేంటో తెలిసి..

ABN , First Publish Date - 2022-01-19T21:35:47+05:30 IST

ఇంట్లోకి దొంగ దూరాడంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గదిలో పరిశీలించగా షాకింగ్ దృశ్యం కనిపించింది. వివరాల్లోకి వెళితే..

ఇంట్లోకి దొంగ దూరాడంటూ పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు.. గదిలో షాకింగ్ దృశ్యం.. అసలు కథేంటో తెలిసి..
ప్రతీకాత్మక చిత్రం

వారిద్దరూ ఎంతో కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. ప్రియురాలు ఏది అడిగినా వెంటనే తెచ్చిచ్చేవాడు. అంతలా వారి మధ్య అనుబంధం పెరిగిపోయింది. సడన్‌గా ఓ రోజు ఆ యువకుడు ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. కాసేపటికే లోపలికి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఇంట్లోకి దొంగ దూరాడంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గదిలో పరిశీలించగా షాకింగ్ దృశ్యం కనిపించింది. వివరాల్లోకి వెళితే..


చెన్నై శివారు పేరవల్లూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పాండిచేరికి చెందిన అరవిందన్(25).. చెన్నైలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో 2018లో పీజీ చదివాడు. ఆ సమయంలో కళాశాలలో అతడితో పాటూ చదివే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు వీరి పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ పార్కులు, సినిమాలకు తిరిగేవారు. ఈ క్రమంలో ప్రేయసి ఏది అడిగినా చిటికెలో సమకూర్చేవాడు. మొదట్లో చిన్న చిన్న కోరికలు కోరిన యువతి.. క్రమంగా పెద్ద పెద్ద బహుమతులు అడిగేది. అయినా యువతి కోరినవన్నీ తెచ్చిచ్చేవాడు. అతడి అమాయకత్వాన్ని క్యాష్ చేసుకోవాలని భావించింది.

నాలుగు నెలలుగా బాలిక ప్రవర్తనలో వింత మార్పులు.. ఓ రోజు ఉన్నట్టుండి.. ఆత్మలతో మాట్లాడొస్తానంటూ..


అర్జంట్ అవసరాలు ఉన్నాయంటూ రూ.3.5లక్షలు కావాలని ఓరోజు అడిగింది. దీంతో అరవింద్.. క్షణం ఆలోచించకుండా డబ్బు సర్దుబాటు చేశాడు. అయితే ఈ విషయం అరవింద్ కుటుంబ సభ్యులకు తెలిసి మందలించారు. డబ్బులు రాబట్టమని రోజూ గట్టిగా చెబుతుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రియురాలికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. అయినా ఆ యువతి మాత్రం పట్టించుకోలేదు. దీంతో ఓరోజు డబ్బులు ఇవ్వమని గట్టిగా అడగడంతో ఫోన్ ఎత్తడం కూడా మానేసింది.

మొదటి భర్త కంటే రెండో భర్త మేలనుకుంది.. కానీ, అతను కూడా... ఆ రోజు రాత్రి ఫుల్‌గా మందు తాగొచ్చి..


యువతి పట్టించుకోకపోవడంతో ఓ రోజు అరవింద్ సరాసరి వాళ్లింటికే వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో యువతికి బదులుగా ఆమె తల్లి ఉంది. డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. తర్వాత ఆమె కేకలు వేస్తూ.. ‘‘తమ ఇంట్లోకి దొంగ చొరబడ్డాడంటూ అరుస్తూ బయటికి పరుగులు తీసింది. దీంతో భయపడ్డ అరవింద్.. ఓ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. తన జేబులోని ఏటీఎం కార్డు తీసుకుని మణికట్టు, గొంతు కోసుకున్నాడు. బయటికి వెళ్లిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. రక్తపు మడుగులో పడి ఉన్న అరవింద్‌ను ఆస్పత్రికి తరలించారు. యువకుడు కోలుకున్న తర్వాత విచారణ చేసి కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న యువతి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

చికెన్ తెస్తానని వెళ్లి.. సాయంత్రానికి కోటీశ్వరుడయ్యాడు.. దెబ్బకు ఈ పెయింటర్ రాతే మారిపోయింది..

Updated Date - 2022-01-19T21:35:47+05:30 IST