పెళ్లికి ఇచ్చిన గిఫ్ట్ బాక్స్‌ను మర్నాడు ఓపెన్ చేసి చూసిన వరుడికి దిమ్మతిరిగే షాక్.. ఆ గిఫ్ట్‌ను ఇచ్చిందెవరో తెలిసి..

ABN , First Publish Date - 2022-05-18T18:50:27+05:30 IST

ప్రేమలో విఫలమైన యువకుల్లో చాలా మంది దురలవాట్లకు బానిలసై జీవితాలను నాశనం చేసుకుంటుంటారు. మరికొందరు యువకులు ఆత్మహత్యలకు పాల్పడుండగా.. ఇంకొందరు యువకులు హత్యలకు...

పెళ్లికి ఇచ్చిన గిఫ్ట్ బాక్స్‌ను మర్నాడు ఓపెన్ చేసి చూసిన వరుడికి దిమ్మతిరిగే షాక్.. ఆ గిఫ్ట్‌ను ఇచ్చిందెవరో తెలిసి..
ప్రతీకాత్మక చిత్రం

ప్రేమలో విఫలమైన యువకుల్లో చాలా మంది దురలవాట్లకు బానిలసై జీవితాలను నాశనం చేసుకుంటుంటారు. మరికొందరు యువకులు ఆత్మహత్యలకు పాల్పడుండగా.. ఇంకొందరు యువకులు హత్యలకు తెగబడుతుంటారు. గుజరాత్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. పెళ్లికి వచ్చిన గిఫ్ట్‌లను మరుసటి రోజు వరుడు, తదితరులు తెరచి చూస్తున్నారు. ఈ క్రమంలో ఓ బాక్సును తెరవగానే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చివరకు ఆ గిఫ్ట్ ఇచ్చిందెవరో తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


గుజరాత్‌లోని నవ్‌సారి జిల్లాలోని మింధబారి గ్రామంలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లతేష్ గవిత్‌కు రెండు రోజుల క్రితం ఓ యువతితో వివాహమైంది. ఈ సందర్భంగా బంధువులు, స్నేహితులు హాజరై భారీగా గిఫ్ట్‌లు అందించారు. వివాహం అయిన మరుసటి రోజు వరుడు, అతడి మేనల్లుడు కలిసి గిఫ్ట్ బాక్సులను తెరచి చూస్తున్నారు. ఈ క్రమంలో బాగా బరువున్న గిఫ్ట్ బాక్సును తెరిచారు. దీంతో అక్కడ ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో వరుడితో పాటూ అతడి మేనల్లుడు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు.

అంతా చూస్తుండగా... గుర్రంపై వరుడు పరార్.. అసలు కారణం తెలిస్తే నవ్వు ఆపుకోలేరు..


గిఫ్ట్ బాక్సులో పేలుడు పదార్థాలను నింపినట్లు గుర్తించారు. విచారణలో సంచలన నిజాలు వెలుగుచూశాయి. ఆ గిఫ్ట్ బాక్సును కోయంబాకు చెందిన రాజు పటేల్.. ఇచ్చినట్లుగా తేలింది. వధువు అక్కతో అతడు కొంతకాలం ప్రేమాయణం సాగించాడు. అయితే తర్వాతా విభేదాలు తలెత్తడంతో విడిపోయారు. అప్పటి నుంచి ప్రేయసి కుటుంబ సభ్యులపై పగ పెంచుకున్నాడు. ఎలాగైనా తన పగ తీర్చుకోవాలని వేచి చూస్తూ ఉన్నాడు. ఈలోగా ప్రేయసి సోదరి పెళ్లి జరుగుతోందని తెలుసుకుని.. గిఫ్ట్ బాక్సులో పేలుడు పదార్థాలను నింపి అందించినట్లు తెలిసింది. కేసు నమోదు చేసిన పోలీసుల నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

పెళ్లిమంటపంలోనే వరుడిని చంపి.. నిన్ను తీసుకెళ్తా.. వధువుకు పక్కింటి యువకుడి ఫోన్‌కాల్.. చివరకు..

Updated Date - 2022-05-18T18:50:27+05:30 IST