-
-
Home » Prathyekam » The Shibari rope bondage technique is catching everyone attention-MRGS-Prathyekam
-
Shibari: షిబారి టెక్నిక్.. బీపీ తగ్గేందుకు తిరుగులేని అస్త్రం..!
ABN , First Publish Date - 2022-06-08T01:04:35+05:30 IST
ఆధునిక జీవితంలో నగర వాసులు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. మానసికంగా, శారీరకంగా సంతోషంగా ఉండలేకపోతున్నారు. ఈ సమస్యల నుంచి..

ఆధునిక జీవితంలో నగర వాసులు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. మానసికంగా, శారీరకంగా సంతోషంగా ఉండలేకపోతున్నారు. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. అయినప్పటికీ పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ శారీరక శ్రమను జీవితంలో భాగంగా చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కానీ బిజీ లైఫ్ కారణంగానో, ఏ ఇతర సమస్యల వల్లనో.. ఆరోగ్య సూత్రాల్ని సరిగ్గా పాటించలేకపోతున్నారు. అలాంటి వారి కోసం షిబారి టెక్నిక్ బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అసలు ఈ షిబారి టెక్నిక్ ఏంటి అనుకుంటున్నారా..? మానసికంగా, శారీరకంగా ఒత్తిడి ఎదుర్కొంటున్న వారి కోసం జపాన్‌లో ఈ టెక్నిక్‌ను ఊపయోగించేవారట.
ఈ పురాతన ఆధ్యాత్మిక కళను భారతీయులకు సెలెబ్రెటీ ట్రావెల్ బ్లాగర్ షెనాజ్ ట్రెజరీ పరిచయం చేశారు. షిబారి టెక్నిక్‌ను స్వయంగా ప్రయత్నించి, తను ఆస్వాదించిన ఆనందాన్ని తన సబ్‌స్ర్కైబర్లకు వెల్లడించారు. దాంతో షిబారి టెక్నిక్‌కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. అసలు షిబారి టెక్నిక్‌లో ఏం చేస్తారంటే... తాళ్లు, కొరడాలతో ఒళ్లంతా చుట్టేసి.. తలకిందులుగా వేలాడదీస్తారు. 8 నుంచి 10 నిమిషాల తర్వాత తాళ్లను విప్పేస్తారు. ఇలా చేయడం వలన శరీరంలో రక్త ప్రసరణ వేగం పెరిగి ఒత్తిడి తగ్గుతుందని నిఫుణులు చెబుతున్నారు. షిబారి టెక్నిక్‌ను జీవితంలో భాగం చేసుకున్న తర్వాత.. మునుపెన్నడూ లేనంత హుషారుగా, ఉత్సాహంగా ఉంటున్నట్టు యువత సైతం అంటున్నారు.