చెల్లెలి కూతురిని చంపేయాలని చూసిన అన్న.. పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు.. విచారణలో ఏం తెలిసిందంటే..

ABN , First Publish Date - 2022-09-27T01:11:11+05:30 IST

రాను రాను అన్న, చెల్లెలు.. అక్క, తమ్ముడు అనే బంధాలకు అర్థాలు మారిపోతున్నాయి. కొందరు శాడిస్టుల కారణంగా.. ఎవరిని నమ్మకూడదో, ఎవరిని నమ్మాలో తెలీని పరిస్థితి నెలకొంది..

చెల్లెలి కూతురిని చంపేయాలని చూసిన అన్న.. పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు.. విచారణలో ఏం తెలిసిందంటే..
ప్రతీకాత్మక చిత్రం

రాను రాను అన్న, చెల్లెలు.. అక్క, తమ్ముడు అనే బంధాలకు అర్థాలు మారిపోతున్నాయి. కొందరు శాడిస్టుల కారణంగా.. ఎవరిని నమ్మకూడదో,  ఎవరిని నమ్మాలో తెలీని పరిస్థితి నెలకొంది. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. ఓ మహిళ తన ఒకటిన్నర నెల వయసున్న పాపను ఎత్తుకుని పోలీస్ స్టేషన్‍‌కు వెళ్లింది. కూతురిని తన అన్న చంపేయాలని చూస్తున్నాడని ఫిర్యాదు చేసింది. చివరకు విచారణ చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ఇండోర్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 35ఏళ్ల మహిళ.. భర్త, అత్తమామలతో ఉంటోంది. గత ఏడాది నవంబర్‌లో ఆమె పుట్టింటికి వెళ్లింది. ఆమె తండ్రికి ఇద్దరు భార్యలు ఉన్నారు. కాగా, రెండో భార్య కొడుకు చెల్లెలిని చూడటానికి వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. చెల్లెలితో ప్రేమగా మాట్లాడుతూ మధ్యలో తాగడానికి జ్యూస్ ఇచ్చాడు. అది తాగిన కాసేపటికి ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. తర్వాత చెల్లెలిపై అతను అత్యాచారానికి పాల్పడ్డాడు. కొన్ని గంటల తర్వాత ఆమె స్పృహలోకి వచ్చింది. జరిగింది తెలుసుకుని అన్నను నిలదీసింది. అన్న అని ప్రేమగా మాట్లాడితే.. ఇంతటి నీచానికి పాల్పడతావా.. అంటూ వాగ్వాదానికి దిగింది.

చోరీ కేసులో అరెస్ట్ చేయబడిన మహిళకు.. రూ.2.50లక్షల పరిహారం ప్రకటించిన కోర్టు.. అసలు కథ ఏంటంటే..


దీంతో ఆగ్రహానికి గురైన అన్న.. బటయ ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. పరువు పోకుండా ఉండాలంటే.. తాను చెప్పినట్లు వినాలంటూ కండీషన్ పెట్టాడు. అప్పటి నుంచి తరచూ చెల్లెలిపై అత్యాచారం చేసేవాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. ఈ విషయం అత్తమామలకు తెలిసి ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. చివరకు చెల్లెలికి ప్రత్యేకంగా గది తీసి అందులో పెట్టాడు. ఇలావుండగా, నెలన్నర క్రితం ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చింది. అయితే పాపను చంపేస్తానని బెదిరించడం మొదలెట్టాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. చివరకు ఆదివారం పోలీసులను ఆశ్రయించింది. విచారించిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. 

Viral Video: రైల్వే స్టేషన్‌లో షాకింగ్ సీన్.. నెట్టింట వైరల్‌గా మారిన 22 సెకన్ల వీడియో..!Read more