యువతిని కొట్టి, దుస్తులు ఊడదీసి మరీ వీడియో తీసిన యువకులు.. చివరకు జేసీబీలతో వెళ్లిన అధికారులు..

ABN , First Publish Date - 2022-09-17T23:38:58+05:30 IST

ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని శిక్షలు అమలు చేస్తున్నా, నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఇక బాలికలు, యువతులు, మహిళలపై జరిగే దాడుల గురించి ప్రత్యేకంగా..

యువతిని కొట్టి, దుస్తులు ఊడదీసి మరీ వీడియో తీసిన యువకులు.. చివరకు జేసీబీలతో వెళ్లిన అధికారులు..

ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని శిక్షలు అమలు చేస్తున్నా, నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఇక బాలికలు, యువతులు, మహిళలపై జరిగే దాడుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రోజూ ఎక్కడో చోట దాడులు, అత్యాచారాలు వంటివి జరుగుతూనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కొందరు యువకులు ఓ యువతిని కొట్టి, దుస్తులు ఊడదీసి మరీ వీడియో తీశారు. అయితే ఈ కేసులో నిందితులపై అధికారులు తీసుకున్న చర్యలపై స్థానికులు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) హమీర్‌పూర్ జిల్లాలోని సిటీ ఫారెస్ట్ పార్క్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆగస్టు 16న ఉదయం ఓ యువతి తన స్నేహితులతో కలిసి సిటీ ఫారెస్ట్ పార్క్‌‌కు వెళ్లింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఏడుగురు యువకులు.. యువతిని గమనించారు. ఆమె పట్ల అసభ్యకరంగా (Indecent behavior) ప్రవర్తించారు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆగ్రహించిన యువకులు.. ఆమెపై దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా బలవంతంగా దుస్తులు మొత్తం విప్పేసి, వీడియో తీశారు. అలాగే ఆ వీడియోను సోషల్ మీడియాలోనూ షేర్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Vegetable sales: ఛీ ఛీ ఇలాంటి వ్యాపారులను ఏమనాలి.. రోజూ కూరగాయలపై మూత్రం పోసి మరీ.. ఇతను చేసిన పని..


పట్టపగలే ఇంతటి దారుణానికి పాల్పడ్డ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. నిందితుల గురించి పూర్తిగా విచారించిన పోలీసులు.. స్థానికంగా వారు అక్రమ నిర్మాణాలు చేపట్టారని గుర్తించారు. దీంతో చివరకు మున్సిపల్ అధికారులతో కలిసి జేసీబీలతో అక్కడికి వెళ్లారు. అక్రమంగా నిర్మించిన ఇళ్లను మొత్తం కూల్చేశారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ కూల్చివేతలు చేపట్టారు. ఇదిలావుండగా, పోలీసులు, అధికారులు తీసుకున్న చర్యలపై స్థానికుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

పొరపాటున ఖాతాలోకి రూ.11 వేల కోట్లు.. కొద్ది గంటల్లోనే మాయం.. కానీ అతడు తెలివిగా చేసిన ఒక్క పనితో రూ.5 లక్షల లాభం..!Read more