-
-
Home » Prathyekam » The police have registered a case against the father who misbehaved with his daughter In Uttar Pradesh kjr spl-MRGS-Prathyekam
-
కన్న కూతురని కూడా చూడకుండా నీచమైన పని.. గుడికి వెళ్లిన భార్య తిరిగొచ్చేసరికి..
ABN , First Publish Date - 2022-09-12T02:54:57+05:30 IST
పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన కొందరు తండ్రులు.. అందుకు విరుద్ధంగా వక్ర దృష్టిలో చూస్తుంటారు. చివరకు సభ్య సమాజం తల దించుకునేలా దారుణాలకు పాల్పడుతుంటారు...

పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన కొందరు తండ్రులు.. అందుకు విరుద్ధంగా వక్ర దృష్టిలో చూస్తుంటారు. చివరకు సభ్య సమాజం తల దించుకునేలా దారుణాలకు పాల్పడుతుంటారు. ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని శిక్షలు అమలు చేస్తున్నా.. కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు. ఉత్తరప్రదేశ్‌లో తాజాగా అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య గుడికి వెళ్లడంతో.. ఇంట్లో ఒంటరిగా ఉన్న కూతురి పట్ల అసభ్యకరంగా (Indecent behavior) ప్రవర్తించాడు. ఇంటికొచ్చిన భార్య.. విచారించగా చివరికి అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) అజిత్మల్ కొత్వాలి పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ధర్మేంద్ర కుమార్ అనే వ్యక్తికి.. భార్య, 12ఏళ్ల కుమార్తె ఉన్నారు. ఇన్నాళ్లూ కుంటుంబాన్ని ఎంతో బాగా చూసుకున్న భర్త.. ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. రోజూ తాగొచ్చి భార్యను వివిధ సాకులు చూపుతూ వేధించేవాడు. అయినా ఆమె భరిస్తూ వచ్చింది. అయితే ఇటీవల అతడు మరింత శాడిస్టుగా తయారయ్యాడు. కన్న కూతురుని కూడా వక్రదృష్టితో చూడడం మొదలెట్టాడు.
వంట చేస్తున్న బాలిక వద్దకు.. పట్టపగలు పెట్రోల్ తీసుకుని వెళ్లిన యువకులు.. కాసేపటి తర్వాత స్థానికులు వెళ్లి చూస్తే..
సెప్టెంబర్ 6న ఉదయం భార్య గుడికి వెళ్లింది. అదే సమయంలో తాగి ఇంటికి వచ్చిన ధర్మేంద్ర.. కూతురిపై కన్నేశాడు. అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటూ వేధించడం మొదలెట్టాడు. తండ్రి అలా చేయడాన్ని కూతురు జీర్ణించుకోలేకపోయింది. తల్లి ఇంటికి రాగానే జరిగిన విషయాన్ని తెలియజేసింది. చివరకు ఆమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.