దుష్ట నివారణ పూజల పేరుతో యువతిని ఇంట్లో బంధించిన పోలీసు.. ఏకంగా 40 రోజుల పాటు..

ABN , First Publish Date - 2022-02-06T22:27:00+05:30 IST

సమాజంలో ఎంతో మంది మంచి వారు ఉన్నట్లే.. కొంతమంది చెడ్డవారు కూడా ఉంటారు. పోలీసు వ్యవస్థ కూడా ఇందుకు మినహాయింపు కాదు. న్యాయం చేయండంటూ వచ్చిన బాధితులనే మోసం చేసిన పోలీసులు చాలా మందే ఉన్నారు...

దుష్ట నివారణ పూజల పేరుతో యువతిని ఇంట్లో బంధించిన పోలీసు.. ఏకంగా 40 రోజుల పాటు..
ప్రతీకాత్మక చిత్రం

సమాజంలో ఎంతో మంది మంచి వారు ఉన్నట్లే.. కొంతమంది చెడ్డవారు కూడా ఉంటారు. పోలీసు వ్యవస్థ కూడా ఇందుకు మినహాయింపు కాదు. న్యాయం చేయండంటూ వచ్చిన బాధితులనే మోసం చేసిన పోలీసులు చాలా మందే ఉన్నారు. చెన్నైలో తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. దుష్ట నివారణ పూజల పేరుతో ఓ యువతిని ఏకంగా 40 రోజులు పాటు గదిలో బంధించాడు. పెను సంచలనం రేపిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే..


తమిళనాడు పళ్లికరణైలో ఓ యువతి నివాసం ఉంటోంది. విదేశాల్లో ఉన్న ఆమె తల్లిదండ్రులు ఇటీవలే మృతి చెందారు. ప్రస్తుతం యువతి ఒంటరిగా జీవనం సాగిస్తోంది. గతంలో మిస్ చెన్నై పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. ఇటీవల సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. ఈస్ట్‌ కోస్టు రోడ్డులో ఈమెకు సొంత స్థలం ఉంది. అయితే ఆ స్థలంలో ఇంటి నిర్మాణం పేరుతో ఓ బిల్డర్ మోసం చేశాడు. అతడిపై ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వెళ్లిన ఆ యువతికి ఏఎస్‌ఐ ఆండ్రు కార్వెల్‌‌తో పరిచయం ఏర్పడింది. కేసు విచారణ పేరుతో రోజూ ఆమెతో మాట్లాడుతూ అతడు దగ్గరయ్యాడు.

బాయ్స్ హాస్టల్లోకి ప్రియురాలిని తీసుకెళ్లాలి... అందుకోసం అతడు వేసిన మాస్టర్ ప్లాన్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది..


ఈ క్రమంలో ఏఎస్ఐని నమ్మిన యువతి.. తన పర్సనల్ విషయాలను కూడా అతడితో షేర్ చేసుకునేది. తన ఇంట్లో సమస్యలు ఉన్నాయని, అందుకే తన తల్లిదండ్రులు అనారోగ్యంతో చనిపోయారని అతని వద్ద వాపోయింది. ఆమె బలహీనతను అవకాశంగా తీసుకున్న కార్వెల్.. దుష్ట నివారణ పూజలు చేయిస్తానని చెప్పాడు. తర్వాత కొంత మంది మత బోధకులను పిలిపించి పూజలు చేయించాడు. ఓ రోజు ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి వెళ్లి యువతిని బలత్కారం చేశాడు. ఆమె తిరస్కరించడంతో గదిలో బంధించి 40రోజుల పాటు చిత్రహింసలకు గురిచేశాడు. ఎలాగోలా అక్కడి నుంచి బయటపడ్డ ఆమె.. పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం పరారీలో ఉన్న కార్వెల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

అయ్యో పాపం.. మరీ ఇంత ఘోరమా.. ప్రియుడి పెళ్లిని ఆపేందుకు ఈ యువతి ఎంత నీచానికి పాల్పడిందంటే..

Read more