-
-
Home » Prathyekam » The police arrested the women along with the owner of a private hospital selling newborn babies In Delhi kjr spl-MRGS-Prathyekam
-
అబార్షన్ చేయించుకునే ఆడపిల్లలతో ఒప్పందం.. ఏకంగా ఆస్పత్రినే దుకాణంగా మార్చేసి.. చివరకు..
ABN , First Publish Date - 2022-08-31T22:52:09+05:30 IST
అబార్షన్ చేయించుకునే ఆడపిల్లలే వారి టార్గెట్. గుట్టు చప్పుడు కాకుండా ఒప్పందం కుదుర్చుకుంటారు. ఇందుకోసం ఏకంగా ఆస్పత్రినే అడ్డగా మార్చేశారు. అవరసరమైన వారికి..

అబార్షన్ చేయించుకునే ఆడపిల్లలే వారి టార్గెట్. గుట్టు చప్పుడు కాకుండా ఒప్పందం కుదుర్చుకుంటారు. ఇందుకోసం ఏకంగా ఆస్పత్రినే అడ్డగా మార్చేశారు. అవరసరమైన వారికి శిశువులను లక్షల రూపాయలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించారు. చివరకు ప్రైవేట్ ఆస్పత్రి యజమానితో పాటూ ముగ్గురు మహిళలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే..
ఢిల్లీలోని (Delhi) జహంగీర్‌పురిలో ఉన్న సంజయ్ గ్లోబల్ హాస్పిటల్ యజమాని సంజయ్ మాలిక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మాలిక్ ఆధ్వర్యంలో కొన్నేళ్లుగా నవజాత శిశువులను (Newborn babies) క్రయవిక్రయాలు చేస్తున్నారని తెలిసింది. ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతంలో ఇప్పటికే చాలా మంది శిశువులను విక్రయించారు. డిమాండ్‌ను బట్టి రూ.50నుంచి రూ.లక్ష వరకూ విక్రయిస్తుంటారు. ఇందుకోసం వివిధ ప్రాంతాల్లో ఉన్న ఏఎన్ఎమ్‌ల సహకారం కూడా తీసుకుంటారని తెలిసింది. ఈ క్రమంలో ఓ యువతి పెళ్లి కాకుండానే గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించుకోవడానికి ఆస్పత్రికి వచ్చింది. ఆమె గర్భవతి కావడంతో ప్రియుడు వదిలేశాడు. ఈ విషయం ఇంట్లో తెలిస్తే సమస్య తలెత్తుతుందనే ఉద్దేశంతో మాలిక్ ఆస్పత్రికి వచ్చింది.
నా మెసేజ్‌లకు రిప్లై ఎందుకు ఇవ్వలేదంటూ యువకుడి ప్రశ్న.. చివరకు స్నేహితులతో కలిసి నేరుగా వెళ్ళిన ప్రియుడు..
ఆమెతో సిబ్బంది ఒప్పందం చేసుకుని రెండు నెలల పాటు వారి వద్దే ఉండేలా మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో ఆమె జూలై 27న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇటీవల ఈ రాకెట్ గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. సీక్రెట్ ఆపరేషన్ (Secret operation) నిర్వహించారు. సాధారణ దుస్తుల్లో ఆస్పత్రికి వెళ్లిన ఇద్దరు మహిళా పోలీసులు.. ఆస్పత్రి సిబ్బందికి విషయం తెలియజేశారు. చివరకు శిశువును రూ.1.10 లక్షలకు విక్రయించేలా ఒప్పందం చేసుకున్నారు. సోమవారం శిశువును వారికి అందించగానే.. పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకుని శిశువు తల్లితో పాటూ, హాస్పిటల్ యజమాని, మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ రాకెట్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు.. ఎంతమందికి శిశువులను విక్రయించారు.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.