ఏడాదిన్నరగా కొడుకు మృతదేహాన్ని ఇంట్లో ఉంచిన తల్లిదండ్రులు.. సడన్‌గా ఊపిరి రావడంతో ఇలా చేశామని చెబుతూ..

ABN , First Publish Date - 2022-09-24T23:45:41+05:30 IST

అతనో ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారి. ఏదాదిన్నర క్రితం కరోనా కారణంగా మృతిచెందాడు. ఆస్పత్రి వారు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేసి, డెత్ సర్టిఫికెట్ కూడా మంజూరు చేశారు. అయితే..

ఏడాదిన్నరగా కొడుకు మృతదేహాన్ని ఇంట్లో ఉంచిన తల్లిదండ్రులు.. సడన్‌గా ఊపిరి రావడంతో ఇలా చేశామని చెబుతూ..

అతనో ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారి. ఏదాదిన్నర క్రితం కరోనా కారణంగా మృతిచెందాడు. ఆస్పత్రి వారు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేసి, డెత్ సర్టిఫికెట్ కూడా మంజూరు చేశారు. అయితే మృతదేహానికి అంత్యక్రియలు చేస్తుండగా.. సడన్‌గా ఊపిరి వచ్చిందని చెప్పడంతో ఇంటికి తరలించారు. మృతదేహాన్ని మమ్మీలా తయారు చేసి ఇన్నాళ్లూ ఇంట్లోనే భద్రపరిచారు. చివరకు విషయం తెలుసుకుని పోలీసులు అక్కడికి చేరుకుని విచారించారు. తల్లిదండ్రుల వాదన విని పోలీసులతో పాటూ స్థానికులంతా షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) కాన్పూర్ పరిధి రోషన్ నగర్‌లో నివాసం ఉంటున్న విమలేష్ కుమార్.. ఆదాయపు నన్ను శాఖలో (Income Tax Department) పని చేస్తున్నాడు. ఇలావుండగా, 2021 ఏప్రిల్‌లో అతను కరోనా బారిన పడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంటుండగా (Corona treatment) పరిస్థితి విషమించి, చివరకు మృత్యువాత పడ్డాడు. అతను మరణించినట్లు అధికారులు ధ్రువీకరణ పత్రాన్ని (Death certificate) మంజూరు చేశారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇదిలావుండగా, అంత్యక్రియలు నిర్వహించే క్రమంలో సడన్‌గా మృతుడికి స్పృహ వచ్చిందని బంధువులు చెప్పారు. దీంతో అంత్యక్రియలను వాయిదా వేసి, మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు.

World Biggest Killer: షాకింగ్.. ప్రతీ యేటా 4 కోట్ల మందికి పైగా జనాల ప్రాణాలను తీస్తున్నది ఏంటో తెలుసా..?


మమ్మీ తరహాలో మృతదేహం చుట్టూ బట్ట చుట్టి భద్రపరిచారు. ఏడాదిన్నరగా ఇంట్లోనే ఉంచుకున్నారు. చుట్టుపక్కల వారు, తెలియని వారు అడిగితే.. తమ కొడుకు కోమాలో ఉన్నాడని చెబుతూ వచ్చారు. అయితే శుక్రవారం ఈ విషయం అధికారులు, పోలీసుల వరకూ వెళ్లింది. దీంతో అక్కడికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అతడు చనిపోయాడని చెప్పారు. అయితే విమలేష్ తల్లిదండ్రులు మాత్రం.. తమ కొడుకు బతికే ఉన్నాడని, కోమాలో ఉన్నాడని పోలీసులతో వాదించారు. దీంతో అధికారులతో పాటూ స్థానికులంతా అవాక్కయ్యారు. కొడుకు చనిపోయాడన్న వార్తను జీర్ణించుకోలేని తల్లిదండ్రులు.. మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ వార్త స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

సీనియర్లు చేసిన పనికి.. రైల్వే స్టేషన్‌కు చేరుకున్న యువతులు.. పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా..Read more