తళ్లయిన పెళ్లికూతురు.. పీటలపైనే కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అసలు విషయం తెలిసింది..

ABN , First Publish Date - 2022-02-09T02:00:20+05:30 IST

కొన్నిసార్లు ఇలాగే అనుకోని ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. చూడటానికి, వినడానికి వింతగా ఉండే ఇలాంటి వార్తలు.. ఇట్టే వైరల్ అయిపోతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఘటనలో ఓ పెళ్లికూతురు వివాహం రోజునే తల్లి అయింది. వినడానికి వింతగా ఉన్నా...

తళ్లయిన పెళ్లికూతురు.. పీటలపైనే కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అసలు విషయం తెలిసింది..

కొన్నిసార్లు ఇలాగే అనుకోని ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. చూడటానికి, వినడానికి వింతగా ఉండే ఇలాంటి వార్తలు.. ఇట్టే వైరల్ అయిపోతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఘటనలో ఓ పెళ్లికూతురు వివాహం రోజునే తల్లి అయింది. వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజం. పెళ్లి పీటలపైనే కడుపునొప్పి రావడంతో అంతా కంగారుపడ్డారు. వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడికి వెళ్లిన కొద్దిసేపటికే పండంటి శిశువుకు జన్మనిచ్చింది. తర్వాత విచారించగా అసలు విషయం తెలిసింది.


ఒడిశాలోని కేట్‌గిరి జిల్లా నవరంగ్‌పూర్‌‌కు చెందిన షీఫ్‌బట్టీ మందాని అనే యువతికి, ఛత్తీస్‌గఢ్‌‌లోని బడేరాజ్‌పూర్‌ జిల్లా బాన్స్‌కోట్ ప్రాంతానికి చెందిన చందన్‌నేతన్‌ అనే యువకుడికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా కొన్నాళ్లకు ప్రేమగా రూపాంతరం చెందింది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఈ క్రమంలో కొన్నాళ్ల తర్వాత వీరి ప్రేమ విషయం పెద్దలకు తెలిసింది. దీంతో ఇద్దరికీ వివాహం చేయాలని ఇరు వైపు కుటుంబాల వారు మాట్లాడుకున్నారు. మంచి ముహూర్తం చూసి పెళ్లి కుమారుడి గ్రామంలో కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. బంధువులు, సన్నిహితులంతా వివాహ మహోత్సవానికి తరలివచ్చారు.

ఈమె చీర ఏంటీ మరీ ఇంత విచిత్రంగా ఉంది.. వీడియో చూసి అవాక్కవుతున్న నెటిజన్లు..


వధూవరులు ఇద్దరూ వేదికపై ఆశీనులయ్యారు. కాసేపుంటే తాళి కట్టే సమయం దగ్గరపడుతుందనగా.. వధువుకు కడుపు నొప్పి మొదలైంది. దీంతో ఆమె తల్లిదండ్రులతో పాటూ బంధువలంతా ఆందోళనలో పడ్డారు. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే వెళ్లిన కొద్ది సేపటికే ఆమె శిశువుకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. పెళ్లికుమార్తెను నిలదీయగా అసలు విషయం బయటపెట్టింది. ప్రేమించుకునే సమయంలోనే ఆమె గర్భం దాల్చినట్లు తెలిసింది. అయినా ఈ విషయం బయటకు చెప్పకపోవడంతో ఎవరికీ తెలియలేదు. సరిగ్గా పెళ్లి ముహూర్థానికి నెలలు నిండడంతో పురటినొప్పులు వచ్చాయి! ప్రేమించిన వాడితోనే వివాహం కావడంతో సమస్య సర్దుమనిగింది. వారిద్దరికీ త్వరలో వారి వివాహం చేయనున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఈ వార్త స్థానికంగా సంచలనం సృష్టించింది.

ఇదేం పని అని ఆశ్చర్యపోతున్నారా..? ఈ కుర్రాళ్లు తలపై గుండ్రంగా జుట్టును ఎందుకిలా తీసేశారో తెలిస్తే..

Updated Date - 2022-02-09T02:00:20+05:30 IST