భార్య కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు.. ఆమె చనిపోయిందని తేల్చిన పోలీసులు.. హంతకుడు ఎవరో తెలుసుకుని షాక్..!

ABN , First Publish Date - 2022-01-25T19:34:10+05:30 IST

తన భార్య కనిపించడం లేదని ఓ వ్యక్తి ఈ నెల 19న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

భార్య కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు.. ఆమె చనిపోయిందని తేల్చిన పోలీసులు.. హంతకుడు ఎవరో తెలుసుకుని షాక్..!

తన భార్య కనిపించడం లేదని ఓ వ్యక్తి ఈ నెల 19న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.. మూడ్రోజుల తర్వాత ఊరి శివారు ప్రాంతంలో ఓ మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు.. మిస్ అయిన మహిళ చనిపోయినట్టు నిర్ధారించుకుని ఫిర్యాదు చేసిన వ్యక్తికి సమాచారం అందించారు.. ఆమెను హత్య చేసిన వ్యక్తి గురించి అన్వేషణ ప్రారంభించారు.. చివరకు నిందితుడిని కనుగొన్నారు.. భర్త చేతిలోనే ఆమె హతమైందని నిరూపించారు. 


హర్యానాలోని కమాల్ ప్రాంతానికి చెందిన శైలేంద్ర అనే వ్యక్తి ఈ నెల 19న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. మూడ్రోజుల తర్వాత చుమాజ్ర గ్రామంలోని ఓ రైతు ఓ మహిళ మృతదేహం గురించి పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడ లభించిన ఆధారాల ప్రకారం ఆ మహిళ మృతదేహం శైలేంద్ర భార్య ప్రియాంకది అని పోలీసులు గుర్తించారు. అతనికి సమాచారం అందించారు. అనంతరం ప్రియాంక హత్య గురించి దర్యాఫ్తు ప్రారంభించారు. 


ప్రియాంక ఇంటి చుట్టు పక్కల వారిని ప్రశ్నించగా ఈ నెల 18న ప్రియాంక, ఆమె భర్త శైలేంద్ర బైక్‌పై వెళ్లడం తాము చూశామని, ఆ తర్వాతి నుంచి ప్రియాంక కనిపించలేదని చెప్పారు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి శైలేంద్రను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో శైలేంద్ర నిజం అంగీకరించాడు. ఇటుక రాయితో తలపై కొట్టి ప్రియాంకను తానే చంపేశానని శైలేంద్ర అంగీకరించాడు. ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతుండడంతో ఆమెను చంపాలని నిర్ణయించుకున్నానని, ఈ నెల 18న ఆమెను వేరే ఊరికి తీసుకెళ్లి చంపేశానని చెప్పాడు. దీంతో శైలేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2022-01-25T19:34:10+05:30 IST