కొడుకు మృతదేహాన్ని చూసిన తర్వాత.. ఆ తల్లి గుండె కూడా ఆగిపోయింది..!

ABN , First Publish Date - 2022-09-09T21:53:21+05:30 IST

తల్లి ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జీవితం మొత్తం పిల్లల సంక్షేమం కోసమే ఆరాటపడుతుంది. పిల్లలకు చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేదు. అలాంటిది కళ్ల..

కొడుకు మృతదేహాన్ని చూసిన తర్వాత.. ఆ తల్లి గుండె కూడా ఆగిపోయింది..!

తల్లి ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జీవితం మొత్తం పిల్లల సంక్షేమం కోసమే ఆరాటపడుతుంది. పిల్లలకు చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేదు. అలాంటిది కళ్ల ముందున్న పిల్లలు, ఒక్కసారిగా కానరాని లోకాలకు వెళ్లారని తెలిస్తే.. తల్లి గుండె తట్టుకోలేదు. బీహార్‌లో ఓ తల్లికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఉదయం విధులకు వెళ్లిన కొడుకు.. సాయంత్రానికి విగతజీవిగా మారాడు. కొడుకు లేడన్న వార్తను ఆమె జీర్ణించుకోలేకపోయింది. గంటల వ్యవధిలోనే ఆ తల్లి గుండె కూడా ఆగిపోయింది. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..


బీహార్ (Bihar) ఔరంగాబాద్‌లోని నలందా పరిధి షంషేర్ నగర్ గ్రామానికి చెందిన రామచంద్ర రామ్‌కు భార్య కమలాదేవి, వినోద్ కుమార్(30) అనే కొడుకు ఉన్నాడు. వినోద్ కుమార్.. గ్రామానికి చెందిన అమరేంద్ర కుమార్ పాండేకు చెందిన కన్‌స్ట్రక్షన్ కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా (Computer operator) పనిచేసేవాడు. కాగా, కొద్దిరోజుల క్రితమే ఉద్యోగం మానేశాడు. అయితే మళ్లీ ఎక్కువ జీతం ఇస్తామనడంతో ఇటీవలే మళ్లీ పనిలోకి చేరాడు. రోజూ ఉదయం విధులకు వెళ్లి, సాయంత్రం ఇంటికి వచ్చేవాడు. అయితే ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. గురువారం సాయంత్రం ఇంటి వద్దకు ఓ అంబులెన్స్ వచ్చింది. చివరకు వినోద్ కుమార్ మృతదేహాన్ని కిందకు దించడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

పద్ధతి మార్చుకోమంటూ యజమాని హెచ్చరిక.. నిద్రపోతున్న సమయంలో వారి గదిలోకి వెళ్లిన వంట మనిషి.. చివరకు..


ఉదయం సంతోషంగా విధులకు వెళ్లిన కొడుకు.. సాయంత్రానికి విగతజీవిగా మారడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇక వినోద్ కుమార్ తల్లి.. రాత్రంతా ఏడుస్తూనే ఉంది. ఆమెను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. అయితే శుక్రవారం ఉదయం ఒక్కసారిగా ఆమె ఏడుస్తూనే కుప్పకూలిపోయింది. అంతా చూస్తుండగానే అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. దీంతో స్థానిక మహిళలందరూ కన్నీటిపర్యంతమయ్యారు. వినోద్ కుమార్‌ను కంపెనీ యజమాని, సిబ్బంది కలిసి.. కొట్టి చంపారంటూ మృతుడి కుటుంబ సభ్యులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ తమకు ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు చేయగానే విచారణ చేసి.. చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొడుకు, తల్లి మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

పదే పదే అదే మాట అంటుండడంతో ఆగ్రహించిన కోడలు.. అత్త వేళ్లను కొరికేయడమే కాకుండా భర్త అని కూడా చూడకుండా..Read more