తన భార్యకు health బాగోలేదంటూ బాలికను ఫ్యాక్టరీ నుంచి ఇంటికి తీసుకెళ్లిన Manager.. బలవంతంగా యాసిడ్ పోసి మరీ..

ABN , First Publish Date - 2022-07-17T21:42:52+05:30 IST

ఆ కుటుంబం కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో కూతురును కూడా ఫ్యాక్టరీ(Factory)లోకి పనికి పంపించేవారు. అయితే ఆ బాలికపై ఫ్యాక్టరీలోని..

తన భార్యకు health బాగోలేదంటూ బాలికను ఫ్యాక్టరీ నుంచి ఇంటికి తీసుకెళ్లిన Manager.. బలవంతంగా యాసిడ్ పోసి మరీ..
ప్రతీకాత్మక చిత్రం

ఆ కుటుంబం కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో కూతురును కూడా ఫ్యాక్టరీ(Factory)లోకి పనికి పంపించేవారు. అయితే ఆ బాలికపై ఫ్యాక్టరీలోని మేనేజర్(Manager) కన్నేశాడు. ఆమె ఆర్థిక అవసరాలను అవకాశంగా తీసుకున్నాడు. రోజూ ప్రేమగా మాట్లాడుతూ సమయం కోసం వేచి చూస్తూ ఉన్నాడు. ఓ రోజు తన భార్యకు health బాగోలేదంటూ బాలికను తన ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం అతడు చేసిన దారుణం.. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.


దేశ రాజధాని Delhi లో ఈ ఘటన చోటు చేసుకుంది. నగర పరిధిలో నివాసం ఉంటున్న ఓ కుటుంబం కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటుంది. వారి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో 15ఏళ్ల కూతుర్ని కూడా ఫ్యాక్టరీలోకి పనికి పంపించేవారు. ఇదిలావుండగా, ఫ్యాక్టరీలో పని చేసే మేనేజర్ ఆమెపై కన్నేశాడు. బాలిక ఆర్థిక అవసరాలను అవకాశంగా తీసుకున్న అతను.. అప్పుడప్పుడూ నగదు సాయం చేస్తుండేవాడు. ఈ క్రమంలో ఓ రోజు తన భార్యకు ఒంట్లో బాలేదు.. ఒకసారి ఇంటికి వెళ్దామని చెప్పి, బాలికను తనతో పాటూ తీసుకెళ్లాడు. ఇంటికి వెళ్లగానే తలుపులు వేసి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

CHILD LOVE: ఈ చిన్నారి ప్రేమకు కేంద్ర మంత్రులే ఫిదా అయ్యారు.. ఇంతకీ ఆ పాప చేసిన పని ఏంటంటే..


అనూహ్య పరిణామానికి ఒక్కసారిగా షాకైన బాలిక.. ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించింది. తన గురించి బయట ఎక్కడ చెబుతుందోనని భయపడ్డ నిందితుడు.. ఆమె నోట్లో బలవంతంగా యాసిడ్(Acid) పోశాడు. అతని నుంచి ఎలాగోలా బయటపడ్డ ఆమె.. ఇంటికి వెళ్లగానే స్పృహతప్పి పడిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. శనివారం బాలికను విచారించిన పోలీసులు .. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఒకే ఒక్క విషయంలో మాట వినలేదని.. ప్రియురాలిని ఊరి బయట నిర్జన ప్రదేశానికి పిలిచి.. ఇద్దరు స్నేహితులతో కలిసి..



Updated Date - 2022-07-17T21:42:52+05:30 IST