యువతితో పరిచయం పెంచుకున్న మటన్ వ్యాపారి... ఓ రోజు ఎవరూ లేని సమయంలో ఇంటికి పిలిచి.. కలిసి ఉందామంటూ..

ABN , First Publish Date - 2022-09-01T02:49:01+05:30 IST

అతనో మటన్ వ్యాపారి. ఇటీవల అతడికి ఓ మహిళ పరిచయమైంది. ఇద్దరూ కలిసి వ్యాపారం చేస్తుండేవారు. ఈ క్రమంలో వారి మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగింది. అప్పుడప్పుడూ ఆమె నగదు..

యువతితో పరిచయం పెంచుకున్న మటన్ వ్యాపారి... ఓ రోజు ఎవరూ లేని సమయంలో ఇంటికి పిలిచి.. కలిసి ఉందామంటూ..

అతనో మటన్ వ్యాపారి. ఇటీవల అతడికి ఓ యువతి పరిచయమైంది. ఇద్దరూ కలిసి వ్యాపారం చేస్తుండేవారు. ఈ క్రమంలో వారి మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగింది. అప్పుడప్పుడూ అతడికి ఆమె నగదు అప్పుగా ఇస్తూ వచ్చింది. ఇలా సాగుతున్న ఆమె జీవితంలో ఉన్నట్టుండి అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఓ రోజు ఎవరూ లేని సమయంలో ఇంటికి పిలిచి, కలిసి ఉందామంటూ బలవంతం చేశాడు. ఇందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో చివరకు దారుణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ఇండోర్‌ పరిధి  ఖజ్రానాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నూర్ మహ్మద్ అనే వ్యక్తి.. స్థానికంగా మటన్ వ్యాపారం (Mutton business) చేస్తుంటాడు. అలాగే మరోవైపు టైల్స్ వ్యాపారం కూడా నిర్వహిస్తుంటాడు. ఈ క్రమంలో అతడికి ఇటీవల కిన్నార్‌ మొహసిన్‌ అలియాస్‌ జోయా అనే యువతితో పరిచయం ఏర్పడింది. మటన్ వ్యాపారంలో ఆమె కూడా చేదోడువాదోడుగా ఉండేది. ఈ క్రమంలో అతడికి పది వేల రూపాయలు అప్పుగా కూడా ఇచ్చింది. ఇలా కొన్ని రోజులకు వారి మధ్య సాన్నిహిత్యం బాాగా పెరిగింది. అయితే ఆమెను ఎలాగైనా తన దారికి తెచ్చుకోవాలని నూర్ మహ్మద్.. వివిధ రకాలుగా ఆలోచిస్తూ ఉండేవాడు. ఇటీవల ఓ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెను తన ఇంటికి రమ్మని పిలిచాడు. అక్కడికి వచ్చిన ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు.

రాత్రి 9గంటలు అవుతున్నా ఇంటికి రాని కూతురు.. ఏమైందా అని విచారిస్తుండగా.. సడన్‌గా వచ్చిన ఫోన్ కాల్‌తో..


ఇద్దరం కలిసి ఉందామంటూ బలవంతం చేశాడు. ఇందుకు ఆమె ఒప్పుకోలేదు. అనంతరం ఇద్దరి మధ్య డబ్బుల విషయంలో కూడా గొడవ కూడా జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నూర్ మహ్మద్.. ఆమెను కత్తితో  హత్య చేసి, మృతదేహాన్ని రెండు భాగాలు చేశాడు. నడుము నుంచి కింద భాగాన్ని ఖజ్రానా ప్రాంతం సమీపంలో పడేశాడు. ఇంకో భాగాన్ని పెట్టెలో ఉంచి దూరంగా పడేయాలని నిర్ణయించుకున్నాడు. స్థానికుల సమచారంలో సగం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విచారణలో భాగంగా స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అనుమానం రావడంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. నేరం అంగీకరించడంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

road accident: అయ్యో..! సరైన సమయానికి ఆస్పత్రికి తీసుకొచ్చినా దక్కని ఫలితం.. చివరకు అంబులెన్స్ డోర్స్ కారణంగా..Read more