గ్రామం ఖాళీ చేసిన యువకుడి కుటుంబం.. విషయం తెలిసి వీడియో రిలీజ్ చేసిన యువతి.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-08-19T01:58:13+05:30 IST

కొన్నిసార్లు పిల్లలు చేసిన పనుల వల్ల.. ఇంట్లోని వారికి సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలాంటి ఘటనలు ప్రేమ వ్యవహారాల్లో (love affairs) ఎక్కువగా సంభవిస్తుంటాయి. ఇప్పుడీ ప్రస్తావన..

గ్రామం ఖాళీ చేసిన యువకుడి కుటుంబం.. విషయం తెలిసి వీడియో రిలీజ్ చేసిన యువతి.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

కొన్నిసార్లు పిల్లలు చేసిన పనుల వల్ల.. ఇంట్లోని వారికి సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలాంటి ఘటనలు ప్రేమ వ్యవహారాల్లో (love affairs) ఎక్కువగా సంభవిస్తుంటాయి. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. బీహార్‌లో ఇటీవల ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. వారిద్దరూ ప్రేమించుకున్నారు. కానీ ఇంట్లో వారు మాత్రం వారి పెళ్లికి నిరాకరించారు. అప్పటికే వారు మేజర్లు కావడంతో ఇంటి నుంచి పరారయ్యారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి యువకుడి కుంటుంబం.. గ్రామాన్ని వదిలిపెట్టింది. ఈ విషయం తెలుసుకున్న యువతి వీడియో రిలీజ్ చేసింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


బీహార్ (Bihar) రాష్ట్రం దర్భంగా పరిధి బహెడి బ్లాక్‌లోని హడ్చా గ్రామానికి చెందిన రాజ్ కుమార్ దాస్, రూపాంజలి.. కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. ఎలాగైనా జీవితాంతం కలిసుండాలని నిర్ణయించుకున్నారు. అయితే వీరి ప్రేమ విషయం ఇటీవల ఇంట్లోని వారికి తెలిసింది. దీనిపై యువతి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం చేశారు. పెళ్లికి ససేమిరా అనడంతో ఇద్దరూ కలిసి పారిపోదామని నిర్ణయించుకున్నారు. మేజర్లు (majors) కావడంతో ఇంట్లో చెప్పకుండా పారిపోయి పెళ్లి చేసుకున్నారు. దీంతో యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ కేసు (Kidnapping case) నమోదు చేసుకున్న పోలీసులు వారి కోసం వెతుకులాట ప్రారంభించారు.

అతడికి అప్పుడప్పుడూ పెళ్లిళ్లు చేసుకోవడం అలవాటు.. భర్త మానసిక స్థితి గురించి మొదటి భార్య చెప్పింది విని అంతా షాక్..


ఈ గొడవల నేపథ్యంలో రాజ్ కుమార్ తల్లిదండ్రులు గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న యువతి.. ప్రియుడితో కలిసి సోషల్ మీడియా ద్వారా వీడియోను రిలీజ్ చేసింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తన ఇష్టానుసారమే రాజ్ కుమార్‌ను పెళ్లి చేసుకున్నానని చెప్పింది. అలాగే వారి వివాహ ధ్రువీకరణ పత్రాన్ని కూడా షేర్ చేసింది. తన కుటుంబ సభ్యుల ద్వారా తమకు, తన భర్త కుటుంబ సభ్యులకు ప్రాణహాని (Life threatening) ఉందని ఆరోపించింది. వారిని విచారించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

పిల్లలను ఇంట్లో వదిలి అర్ధరాత్రి అత్తగారింటికి వెళ్లి.. చివరకు భార్య గదిలో అతడు చేసిన దారుణం..Updated Date - 2022-08-19T01:58:13+05:30 IST