తప్పు చేస్తున్నావు.. పద్ధతి మార్చుకో.. అంటూ భర్త చెప్పింది విని ఆ భార్యలో మార్పు.. కానీ చివరకు షాకింగ్ సీన్..!

ABN , First Publish Date - 2022-02-09T22:24:35+05:30 IST

భర్తను కాదని ఓ మహిళ తప్పు చేసింది. అయితే కొన్నాళ్లకు తన తప్పు తెలుసుకుంది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చివరకు...

తప్పు చేస్తున్నావు.. పద్ధతి మార్చుకో.. అంటూ భర్త చెప్పింది విని ఆ భార్యలో మార్పు.. కానీ చివరకు షాకింగ్ సీన్..!
ప్రతీకాత్మక చిత్రం

ఎంతటి వారైనా తప్పులు చేయడం మామూలే. అయితే తప్పును సరిదిద్దుకుని.. మళ్లీ అలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్తపడాల్సి ఉంటుంది. లేదంటే నలుగురిలో నవ్వులపాలు కావడంతో పాటూ కొన్నిసార్లు చివరకు జీవితాలే సర్వనాశనం అవుతాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే.. బీహార్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. భర్తను కాదని ఓ మహిళ తప్పు చేసింది. అయితే కొన్నాళ్లకు తన తప్పు తెలుసుకుంది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చివరకు జరిగిన దారుణం తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..


బీహార్‌కు చెందిన గులాం షేక్ అనే యువకుడు.. పూణేలోని లోహెగావ్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఇతడి నివాసానికి దగ్గరలో నివాసం ఉంటున్న మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఎవరూ లేని సమయంలో ఆమెతో మాట్లాడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో ఆమెకు బాగా దగ్గరయ్యాడు. కొన్నాళ్లకు ఇద్దరి మధ్య.. వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరి వ్యవహారం కొన్ని రోజులు గుట్టుగానే నడిచింది. తర్వాత ఈ విషయం ఆనోటా, ఈనోటా పడి చివరకు మహిళ కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో పద్ధతి మార్చుకోవాలంటూ కుటుంబ సభ్యులు ఆమెను గట్టిగా హెచ్చరించారు. వారి సూచనలతో తప్పు తెలుసుకున్న మహిళ.. ఇకపై ఆ యువకుడితో మాట్లాడకూడదని బలంగా నిర్ణయించుకుంది.

తళ్లయిన పెళ్లికూతురు.. పీటలపైనే కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అసలు విషయం తెలిసింది..‘ఇకపై నాతో మాట్లాడొద్దు, నన్ను కలవద్దు..’ అంటూ యువకుడితో ఆ మహిళ తేల్చి చెప్పేసింది. ‘‘నువ్వు ఎన్ని చెప్పినా.. నేను నిన్ను మర్చిపోలేను’’.. అంటూ ఆ యువకుడు రోజూ ఆమెనే వెంబడించేవాడు. ఈ క్రమంలో ఓ రోజు మహిళ చాలా కోపంగా ‘‘నాతో మాట్లాడటానికి ప్రయత్నిస్తే బాగుండదు చెప్తున్నా’’ అంటూ మందలించింది. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న ఆ యువకుడు.. ఎలాగైనా ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఓ రోజు ఆమె వద్దకు వెళ్లి మళ్లీ గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహంతో ఆమెపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గులాం షేక్ కోసం గాలిస్తున్నారు.

పగిలిపోయిన 10 రూపాయల టీ కప్పు.. పేలిన తూటా.. ఆస్పత్రి పాలయిన భర్త..!

Read more