The Lancet Journals: అరుదైన అవకాశం.. ఒక్క క్లిక్‌తో అరచేతిలో ఆరోగ్య సమాచారం..!

ABN , First Publish Date - 2022-11-18T12:45:56+05:30 IST

మామూలు జనాలు ఈ పేరును ఎప్పుడూ విని ఉండరు కానీ.. మెడికల్ ఫీల్డ్‌లో ఉన్న వారికీ, వైద్య విద్యను చదువుతున్న వారికి ఈ పేరు సుపరిచితమే.

The Lancet Journals: అరుదైన అవకాశం.. ఒక్క క్లిక్‌తో అరచేతిలో ఆరోగ్య సమాచారం..!

The Lancet.. మామూలు జనాలు ఈ పేరును ఎప్పుడూ విని ఉండరు కానీ.. మెడికల్ ఫీల్డ్‌లో ఉన్న వారికీ, వైద్య విద్యను చదువుతున్న వారికి ఈ పేరు సుపరిచితమే. తమకు ఉన్న సందేహాలను, పలు సమస్యలకు పరిష్కారాలను తెలుసుకునేందుకు డాక్టర్లు, వైద్య విద్యార్థులు ల్యాన్సెట్ అనే ఈ ఆరోగ్య వార పత్రికను అప్పుడప్పుడు చూస్తూనే ఉంటారు. అప్పుడెప్పుడో 1823వ సంవత్సరంలో ప్రారంభమైన ఈ పత్రిక నిరంతరాయంగా ప్రతీ వారం వివిధ ఆరోగ్య సమస్యల గురించి, కొత్త కొత్త వ్యాధుల గురించి పరిశోధనాత్మక కథనాలను, అరుదైన వైద్య సమస్యలకు సంబంధించిన కేస్ రిపోర్టులను, అంతర్జాతీయ స్థాయి వైద్యుల ఇంటర్వ్యూలను, వైద్య రంగంలో వెలువడిన పుస్తకాల రివ్యూలకు సంబంధించిన మేగజైన్‌ను ప్రతీ వారం ప్రచురిస్తూ ఉంటుంది.

అయితే 200 ఏళ్లుగా క్రమం తప్పకుండా ప్రచురించబడుతున్న ఈ ఆరోగ్య వార పత్రిక.. తన పాఠకులకు ఓ అరుదైన అవకాశాన్ని కల్పిస్తోంది. ల్యాన్సెట్, ఇంకా దాని అనుబంధ పత్రికల నుంచి ఎంతో అమ్యూల్యమైన, అత్యాధునాతనమైన నివారణ, చికిత్స, పరిశోధనాత్మక సమాచారాన్ని తమ పాఠకులకి నేరుగా అందించేందుకు సిద్ధమయింది. రిజిస్టర్ చేసుకున్న వారి ఈ మెయిల్స్ కి నేరుగా వారు ఎంచుకున్న పత్రికల నుంచి ఆర్టికల్స్ పంపనున్నట్లు గురువారం తాజాగా విడుదలైన The Lancet పత్రిక ప్రకటించింది. దానికి గాను పాఠకులు ఈ దిగువ లింక్ లో వివరాలను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ పేరు, ఈమెయిల్, వృత్తికి సంబంధించిన వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. వైద్యరంగానికి సంబంధించిన విలువైన సమచారాన్ని ల్యాన్సెట్ నుంచి పొందేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేసి వివరాలను సబ్మిట్ చేయండి.

https://info.thelancet.com/lancet-2022-jcr?utm_campaign=jcr22&utm_source=jbs-etoc&utm_medium=email&utm_content=laneur (ఈ లింక్ పై క్లిక్ చేయండి.)

Updated Date - 2022-11-18T12:46:09+05:30 IST