మండపంలోకి వెళ్లగానే కళ్లు తిరిగి కిందపడ్డ వరుడు.. ఒక్కసారిగా విగ్గు ఊడిపోవడంతో.. చివరకు వధువు చేసిన పని..
ABN , First Publish Date - 2022-05-22T23:21:59+05:30 IST
వెయ్యి అబద్దాలు ఆడైనా ఒక పెళ్లి చేయమంటారు పెద్దలు. పెళ్లయిన తర్వాత అబద్దాల సంగతి బయట పడినా చాలామంది సర్దుకుపోతుంటారు. చిన్న చిన్న అబద్దాల విషయంలో ఎలాంటి సమస్య లేకున్నా.. పెద్ద పెద్ద..

వెయ్యి అబద్దాలు ఆడైనా ఒక పెళ్లి చేయమంటారు పెద్దలు. పెళ్లయిన తర్వాత అబద్దాల సంగతి బయట పడినా చాలామంది సర్దుకుపోతుంటారు. చిన్న చిన్న అబద్దాల విషయంలో ఎలాంటి సమస్య లేకున్నా.. పెద్ద పెద్ద అబద్దాలు ఆడిన సందర్భాల్లో దంపతులు చివరకు పంచాయితీల వరకూ వెళ్లిన సందర్భాలు చాలా చూశాం. ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. పెళ్లి కావడం కోసం ఓ వ్యక్తి ఆడిన చిన్న అబద్దం.. చివరకు చాలా దూరం వెళ్లింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉన్నావ్ అనే వ్యక్తికి ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. అందరిలాగే ఉన్నావ్ కూడా పెళ్లి కావాలనే ఉద్దేశంతో తనకు బట్టతల ఉందనే విషయాన్ని దాచిపెట్టాడు. పెళ్లిచూపుల నుంచి పెళ్లి రోజు వరకూ విగ్గు పెట్టుకుని కవర్ చేశాడు. తీరా ముహూర్తం దగ్గర పడుతున్న సమయంలో అలసటకు గురైన వరుడు.. మండపంలోనే కళ్లు తిరిగి పడిపోయాడు. దీంతో తలకు ఉన్న విగ్గు ఒక్కసారిగా ఊడిపోయింది. దీంతో అప్పటిదాకా నిజమైన జుట్టు అని భావించిన వధువు, ఆమె బంధువులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు నిజం తెలియడంతో వరుడు అందరి ముందూ నవ్వులపాలయ్యాడు.
జలపాతం వద్ద స్టంట్ చేయాలని చూసిన యువకుడు.. మరుక్షణమే అతడి పరిస్థితి..
తనకు కాబోయే భర్తకు బట్టతల ఉందన్న విషయాన్ని జీర్ణించుకోలేని వధువు.. అతన్ని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది. పెద్దలు కలుగజేసుకుని ఎంత నచ్చజెప్పినా వినిపించుకోలేదు. చివరకు వీరి పంచాయితీ పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది. వధువుకు పోలీసులు నచ్చజెప్పినా కూడా ఫలితం లేకుండా పోయింది. పంచాయితీ అనంతరం పెళ్లి ఖర్చుల పేరుతో వరుడి కుటుంబం నుంచి వధువు కుటుంబ సభ్యులు రూ.5.66 లక్షలు వసూలు చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వధువు ఒప్పుకోకపోవడంతో చివరకు ఎవరింటికి వారు వెళ్లిపోయారు. ఈ వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.