-
-
Home » Prathyekam » The husband locked his wife in the room for four years on the pretext of insanity In Madhya Pradesh kjr spl-MRGS-Prathyekam
-
చీకటి గదిలో నాలుగేళ్లుగా ఆ భార్యకు నరకం.. మలమూత్రాల మధ్య జీవనం.. గది తలుపులు తీస్తే కనిపించిన దృశ్యం చూసి..
ABN , First Publish Date - 2022-07-21T23:09:40+05:30 IST
కూతురుకు అనారోగ్యం అని తెలియగానే ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. ఎలావుందో అని కంగారుగా చూడటానికి వెళ్లారు. అయితే ఆస్పత్రికి వెళ్లింది అని ఒకసారి, బయటకు వెళ్లిందంటూ..

కూతురుకు అనారోగ్యం అని తెలియగానే ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. ఎలావుందో అని కంగారుగా చూడటానికి వెళ్లారు. అయితే ఆస్పత్రికి వెళ్లింది అని ఒకసారి, బయటకు వెళ్లిందంటూ మరోసారి.. ఇలా పదే పదే ఏదో ఒక కారణం చెబుతుండడంతో మరింత కంగారుపడ్డారు. చివరకు తమ కూతురిని చూపించమని గట్టిగా నిలదీయడంతో దాడి చేయడానికి ప్రయత్నించారు. ఎట్టకేలకు పోలీసుల సహకారంతో బలవంతంగా తలుపులు తీశారు. లోపల కూతురు హృదయ విదారక పరిస్థితిలో ఉండడం చూసి కుమిలిపోయారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
మధ్యప్రదేశ్ రాష్ట్రం మందసౌర్లోని నహర్ఘర్ పరిధి పిప్లియా కరాడియా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న దంపతులకు 17 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొందరు మహిళలతో కలిసి భార్య.. చిన్న చిన్న గ్రూపులు ఏర్పాటు చేసుకుని అప్పులు ఇవ్వడం, తిరిగి రాబట్టుకోవడం వంటి పనులు చేస్తుండేది. ఇలావుండగా, నాలుగేళ్ల క్రితం ఆమెకు అనారోగ్యంగా ఉండడంతో తల్లిదండ్రులు.. రాజస్థాన్లోని వారి ఇంటికి తీసుకెళ్లారు. అయితే కొన్ని రోజులు గడవగానే భార్యను తీసుకురావడానికి భర్త అక్కడికి వెళ్లాడు.
బస్టాండ్లో ఉండగా లిప్స్టిక్ అడిగిన భార్య.. సరేనని షాపునకు వెళ్లిన భర్త.. తిరిగొచ్చేసరికి షాకింగ్ ట్విస్ట్.. అసలు కథేంటంటే..
తనకు చికిత్స చేయిస్తానంటూ అత్తమామలకు చెప్పి ఇంటికి తీసుకొచ్చాడు. అయితే చికిత్స చేయించకుండా.. మతిస్థిమితం సరిగా లేదంటూ భర్త, అత్తమామలు కలిసి ఆమెను ఓ గదిలో బంధించారు. కూతురు ఆరోగ్యం మెరుగుపడలేదని తెలుసుకున్న తల్లిదండ్రులు.. చూడటానికి వచ్చారు. అయితే ఏదో ఒక సాకు చెప్పి, ఆమెను చూపించలేదు. నాలుగేళ్లుగా ఎన్నిసార్లు అడిగినా కూతురిని చూపించకపోవడంతో చివరకు గట్టిగా నిలదీశారు. దీంతో అల్లుడు, మరికొంతమంది కలిసి దాడి చేయడానికి ప్రయత్నించారు.
సెలవు రోజు కోచింగ్ సెంటర్కు వెళ్లిన యువతి.. లోపలికి వెళ్లాక యజమాని ఒక్కడే ఉండడంతో షాక్.. చివరకు..
దీంతో చేసేదేమీలేక చివరకు పోలీసులను ఆశ్రయించారు. వారి సాయంతో బలవంతంగా తలుపులు తీసి చూడగా.. లోపల కూతురు పరిస్థితి దారుణంగా కనిపించింది. నాలుగేళ్లుగా ఒకే గదిలో బంధించడంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. దీనికితోడు మలమూత్రాల మధ్య ఆమె పడిన నరకం చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. చివరకు ఆమెను రక్షించి, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి భర్త, అత్తమామలపై.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.