ఫిబ్రవరిలో పెళ్లి ఉండగా... ఒప్పందం ప్రకారం నడుచుకోలేదని.. వరుడు తీసుకున్న నిర్ణయం ఎంత వరకు వెళ్లిందంటే..

ABN , First Publish Date - 2022-01-13T23:19:18+05:30 IST

వివాహ తంతు పూర్తయ్యే వరకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీని పరిస్థితి. లక్నోలో తాజాగా జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. ఫిబ్రవరిలో పెళ్లి నిశ్చయం చేసుకున్న వరుడు చివరకు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు..

ఫిబ్రవరిలో పెళ్లి ఉండగా... ఒప్పందం ప్రకారం నడుచుకోలేదని.. వరుడు తీసుకున్న నిర్ణయం ఎంత వరకు వెళ్లిందంటే..
ప్రతీకాత్మక చిత్రం

వివాహాల సమయంలో అప్పుడప్పుడూ సినిమా తరహా ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అలాంటి వార్తలు విన్నప్పుడు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. వివాహ తంతు పూర్తయ్యే వరకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీని పరిస్థితి. లక్నోలో తాజాగా జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. ఫిబ్రవరిలో పెళ్లి నిశ్చయం చేసుకున్న వరుడు చివరకు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అత్తింటి వారు ఒప్పందం ప్రకారం నడుచుకోలేదని అతడు తీసుకున్న నిర్ణయం ఎంతవరకు వెళ్లిందంటే..


యూపీలోని కేడీ అనే గ్రామానికి చెందిన ఖుష్బు అనే యువతికి సమీప​ గ్రామంలోని యూనస్‌తో పెళ్లి నిశ్చయమైంది. ఫిబ్రవరిలో పెళ్లి నిర్వహించేలా మాట్లాడుకున్నారు. అలాగే కట్నం కింద వరుడికి రూ.5లక్షల నగదు, ఒక కారు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. అది కూడా పెళ్లికంటే ముందే ఇవ్వాలని వరడు కుటుంబ సభ్యులు షరతు విధించారు. కూతురు భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని వధువు తల్లిదండ్రులు కూడా అందుకు అంగీకరించారు.  పెళ్లి నిశ్చయమవడంతో వైవాహిక జీవితాన్ని తలచుకుంటూ యువతి సంతోషంగా ఉండేది.  ఈ క్రమంలో వరుడి కుటుంబ సభ్యులు కట్నం ఇవ్వాలని ఒత్తిడి చేశారు.

ఫిట్స్ కారణంగా చనిపోయాడంటూ భర్త అంత్యక్రియలు.. రెండు రోజుల తర్వాత కొడుకు బయటపెట్టిన నిజం.. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే..


అయితే వివిధ కారణాలతో వధువు తల్లిదండ్రులు కట్నం డబ్బులు ఇవ్వడంలో ఆలస్యం చేశారు. వివాహం అయ్యేలోగా కట్నం డబ్బులను ఇస్తామని చెప్పినా.. వరుడు మాత్రం అందుకు అంగీకరించలేదు. ముందే ఇవ్వాల్సిందే అని పట్టుబట్టాడు. అయితే కట్నం డబ్బులు ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన వరుడు.. పెళ్లి చేసుకునేది లేదని చెప్పాడు. ఈ వార్త వినగానే వధువు కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. మరోవైపు వధువు తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పెద్దల సమక్షంలో ప్రేమ పెళ్లి.. ఏడాది తర్వాత అనుకోని ఘటన.. చివరకు కొడుకుతో సహా భార్య ఏం చేసిందంటే..

Updated Date - 2022-01-13T23:19:18+05:30 IST