రైల్లో బెర్త్‌పై పడుకుని ఉన్న 17 ఏళ్ల అమ్మాయి.. సడన్‌గా పోలీసుల ఎంట్రీ.. మధ్యలోనే దింపేసి స్టేషన్‌కు.. అసలు కథేంటంటే..

ABN , First Publish Date - 2022-09-13T22:07:42+05:30 IST

చిన్న చిన్న సమస్యలకే కొందరు యువతులు షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటుంటారు. పరీక్ష తప్పాననో, తల్లిదండ్రులు తిట్టారనో, ప్రేమికుడు మోసం చేశాడనో.. ఇలా వివిధ సమస్యలకు...

రైల్లో బెర్త్‌పై పడుకుని ఉన్న 17 ఏళ్ల అమ్మాయి.. సడన్‌గా పోలీసుల ఎంట్రీ.. మధ్యలోనే దింపేసి స్టేషన్‌కు.. అసలు కథేంటంటే..

చిన్న చిన్న సమస్యలకే కొందరు యువతులు షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటుంటారు. పరీక్ష తప్పాననో, తల్లిదండ్రులు తిట్టారనో, ప్రేమికుడు మోసం చేశాడనో.. ఇలా వివిధ సమస్యలకు మానసికంగా కుంగిపోతుంటారు. కొందరైతే చివరకు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతుంటారు. మహారాష్ట్రలో విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. 17ఏళ్ల ఓ యువతి రైల్లో బెర్త్‌పై పడుకుని ఉండగా.. సడన్‌గా పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఆమెను మధ్యలోనే దింపేసి స్టేషన్‌కు తరలించారు. విచారణలో చివరకు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే..


యూపీలోని లక్నోకు చెందిన దంపతులు.. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో నివాసం ఉంటున్నారు. వీరి 17ఏళ్ల కుమార్తెకు య్యూటూబ్‌లో (YouTuber) మంచి క్రేజ్ ఉంది. ఈమె చానల్‌కు సుమారు 45 లక్షల మంది ఫాలోవర్లు (Millions of followers) ఉన్నారు. దీంతో ఈమె ప్రతి నెలా పెద్ద మొత్తంలో సంపాదిస్తోంది. ఇదిలావుండగా, ఇటీవల ఓ రోజు ఆమెను ఏదో విషయమై తల్లిదండ్రులు గట్టిగా మందలించారు. దీన్ని తీవ్ర అవమానంగా భావించిన ఆమె.. చెప్పాపెట్టకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. యూపీలోని లక్నోకు వెళ్లేందుకు రైలు ఎక్కింది.

కన్న కూతురని కూడా చూడకుండా నీచమైన పని.. గుడికి వెళ్లిన భార్య తిరిగొచ్చేసరికి..


కూతురు కనిపించడపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు.. తెలిసిన వారిని విచారించారు. అయినా ఫలితం లేకపోవడంతో, తమ కూతును ఇంటి నుంచి వెళ్లిపోయింది.. ఎవరైనా గుర్తుపడితే సమాచారం అందించాలంటూ వీడియో తీసి, కూతురు చానెల్‌లో షేర్ చేశాడు. అనంతరం పోలీసులకు కూడా సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని ప్రాంతాల్లో విచారించారు. చివరకు శనివారం రాత్రి లక్నో రైల్లో బెర్త్‌పై పడుకుని ఉన్న ఆమెను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తీసుకొచ్చారు. తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకుని ఇంటికి తీసుకెళ్లారు. ఆమె య్యూటూబ్ స్టార్ కావడంతో ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

భార్యను కొట్టి అర్ధనగ్నంగా కూర్చోబెట్టి మరీ ఓ భర్త దారుణం.. ఇంట్లో సీసీ కెమెరాలు అమర్చడంతో..Read more