నాలుగు నెలలుగా బాలిక ప్రవర్తనలో వింత మార్పులు.. ఓ రోజు ఉన్నట్టుండి.. ఆత్మలతో మాట్లాడొస్తానంటూ..

ABN , First Publish Date - 2022-01-18T02:38:30+05:30 IST

కర్ణాటకలో ఇంటర్ చదివిన ఓ బాలికకు వింత కోరిక కలిగింది. నాలుగు నెలలుగా ఆమె ప్రవర్తనలో మార్పులు రావడం కుటుంబ సభ్యులు గమనించారు. ఓ రోజు ఉన్నట్టుండి.. ఆత్మలతో మాట్లాడొస్తానంటూ వెళ్లింది. వివరాల్లోకి వెళితే..

నాలుగు నెలలుగా బాలిక ప్రవర్తనలో వింత మార్పులు.. ఓ రోజు ఉన్నట్టుండి.. ఆత్మలతో మాట్లాడొస్తానంటూ..

ఇటీవల యువత తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. పరీక్షల్లో ఫెయిలవడం, ప్రేమ వ్యవహారాలు, కుటుంబ సమస్యలు తదితర కారణాలతో కుంగిపోతున్నారు. ఈ క్రమంలో వారి బలహీనతను కొందరు అవకాశంగా తీసుకుని వివిధ రకాలుగా మోసాలు చేయడం చూస్తూనే ఉన్నాం. ఇంకొందరు యువతీయువకులైతే.. మూఢ భక్తికి లోనైపోయి వింత వింతగా ప్రవర్తించడం, చివరకు ప్రాణాలు తీసుకోవడం కూడా చూశాం. కర్ణాటకలో ఇంటర్ చదివిన ఓ బాలికకు వింత కోరిక కలిగింది. నాలుగు నెలలుగా ఆమె ప్రవర్తనలో మార్పులు రావడం కుటుంబ సభ్యులు గమనించారు. ఓ రోజు ఉన్నట్టుండి.. ఆత్మలతో మాట్లాడొస్తానంటూ వెళ్లింది. వివరాల్లోకి వెళితే..


బెంగళూరు నగరానికి చెందిన అభిషేక్ అనే వ్యక్తికి అనుష్క(17) అనే కుమార్తె ఉంది. ఇంటర్ చదివిన బాలిక నాలుగు నెలలుగా వింత వింతగా ప్రవర్తించడాన్ని కుటుంబ సభ్యులు గమనించారు. ‘‘ఆత్మలకు సంబంధించిన షామనిజం మతం గురించి తెలుసుకుంటున్నాను’’.. అంటూ అప్పుడప్పుడూ తండ్రితో చెప్పేది. అయినా వారు పెద్దగా పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఆమె గత అక్టోబర్ 31న రెండు జతల దుస్తులు, రూ.2500 నగదు తీసుకుంది. ఆత్మలతో మాట్లాడొస్తానంటూ ఇరుగుపొరుగు వారికి చెప్పి వెళ్లిపోయింది. రోజూ ఆత్మల గురించి చెబుతుంటే సరదాగా తీసుకున్న తల్లిదండ్రులు.. చివరకు కూతురు ఇంటి నుంచి వెళ్లిపోవడంతో షాక్ అయ్యారు.

మాజీ ప్రియుడిపై పోలీసులకు యువతి ఫిర్యాదు.. అనుమానం వచ్చి విచారించగా.. బయటపడ్డ ‘ప్రేయసి’ బండారం!


కూతురి అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక షామనిజం మతం వైపు మళ్లేలా ఎవరైనా ప్రోత్సహించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు నెలలుగా ఆమె కోసం గాలిస్తున్నారు. అయినా ఇప్పటికీ బాలిక ఆచూకీ గుర్తించలేకపోయారు. ఏకాంతంగా గడుపుతూ ఆత్మల గురించి మాట్లాడుతుంటే.. గతంలో ఓసారి కౌన్సెలింగ్ ఇప్పించామని బాలిక తండ్రి తెలిపారు. అప్పటి నుంచి తమతో సరిగా మాట్లాడలేదని, కానీ చివరకు ఇలా ఇంటి నుంచి వెళ్లిపోతుందని ఊహించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కూతురును వెతికేందుకు సోషల్ మీడియా ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.

చికెన్ తెస్తానని వెళ్లి.. సాయంత్రానికి కోటీశ్వరుడయ్యాడు.. దెబ్బకు ఈ పెయింటర్ రాతే మారిపోయింది..

Read more